”దూత” ట్రైలర్ రిలీజ్.. చైతూ హిట్ అందుకునేనా?

టాలెంటెడ్ డైరెక్టర్లలో విక్రమ్ కే కుమార్( Vikram K Kumar ) ఒకరు.

ఈయన తీసిన సినిమాలన్నీ ఒక క్లాసిక్ సినిమాలుగా మిగిలి పోయాయి.ఒక మనం.

ఒక 24 సినిమా.ఇలా ఈయన సినిమాలో కథాంశంను మలచిన తీరు ప్రేక్షకులను ఆకట్టు కుంది.

అయితే అలాంటి సినిమాలు తీసింది విక్రమ్ నేనా అనేలా తన గత సినిమా ఉంది.

విక్రమ్ గత సినిమా థాంక్యూ ( Thank You ) ఏ రేంజ్ లో ప్లాప్ అయ్యిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.

నాగ చైతన్య ( Naga Chaitanya ) హీరోగా నటించిన థాంక్యూ సినిమా అట్టర్ ప్లాప్ గా నిలిచింది.

వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న చైతూకు థాంక్యూ నుండి ప్లాపుల పరంపర కొనసాగుతుంది.

దీంతో చైతూ రేసులో వెనుకబడి పోయాడు. """/" / మరి థాంక్యూ సినిమాతో పాటు ఇదే కాంబోలో మరో ప్రాజెక్ట్ తెరకెక్కిన విషయం తెలిసిందే.

అయితే ఇది మాత్రం వెబ్ సిరీస్ కావడం విశేషం.నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబోలోనే ''దూత''( Dhootha Web Series ) అనే వెబ్ సిరీస్ కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ థాంక్యూ ప్లాప్ కారణంగా ఇప్పటి వరకు రిలీజ్ కు రెడీ కాలేకపోయింది.

ఇక ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ కు డేట్ ఫైనల్ చేసి ప్రమోషన్స్ కూడా షురూ చేసారు.

"""/" / ఈ రోజు చైతూ పుట్టిన రోజు కావడంతో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో చైతూ జర్నలిస్టుగా కనిపిస్తుండగా ఈయన నటన, లుక్స్ అన్నీ కూడా బాగా సూట్ అవ్వడంతో ఈ వెబ్ సిరీస్ తో ఓటిటిలో అదిరిపోయే డెబ్యూ ఇచేలా కనిపిస్తున్నాడు.

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో( Amazon Prime Video ) ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

థియేటర్స్ లో ప్లాప్ అయినా ఈ కాంబో ఓటిటిలో అయినా హాట్ అనిపించుకుంటుందో లేదో చూడాలి.

బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే మీ బెల్లీ ఫ్యాట్‌ మటాష్..!