మాది కులాంతర ప్రేమ వివాహమే.. తల్లిదండ్రులు పరువుగా భావించి ఒప్పుకోలేదు.! చివరికి ఇప్పుడు.?
TeluguStop.com
మాది కులాంతర ప్రేమ వివాహమే.తల్లిదండ్రులు పరువుగా భావించి ఒప్పుకోలేదు .
స్నేహితుల సహాయంతో లేచిపోయి పెళ్లి చేసుకున్నాం, పెళ్లి అయ్యాక అమ్మాయి వైపు బంధువులనుంచి ఇబ్బందులు మెదలైయ్యాయి.
మమ్మల్ని కలవనీయకుండా నా శ్రీమతిని వారింట్లో నిర్భందించారు, మా ఇద్దరినీ వేరుచేసి తనకు వారి కులంలో వారికిచ్చి వేరే పెళ్లిచేయాలని ప్లాన్ చేశారు,
పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం, మా బంధువుల సహాయంతో రెండవసారి మేమిద్దరం మళ్లీ వెళ్లిపోయి రెండు నెలలు ఎవ్వరికి కాంటాక్ట్ లో లేము.
పరిస్థితులు చక్కబడ్డాక తల్లిదండ్రులు ఆలోచించి మమ్మల్ని అర్థం చేసుకుని ఇంటికి తీసుకెళ్లి ఆశీర్వదించారు.
ఇప్పటికి మాకు పెళ్లై 7yrs.6yrs బాబు, Happy గానే ఉన్నాము.
మాలాగే చాలా మంది కులాంతర ప్రేమ వివాహాలతో కష్టాలు ఎదుర్కొని Happy గానే ఉండుంటారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
కానీ తల్లిదండ్రులకు ఆ క్షణంలో బాధ కలగొచ్చు, సొసైటీలో ఎవరో ఏదో అనుకుంటారని
పరువుతో కూడిన చంపేయాలన్న కోపం మీకు రావొచ్చు.
మీరు మీ బాధ్యతగా మీ పిల్లలకు ఎవరో ముక్కు మెహం తెలియని ఆస్థి అంతస్తు ఉన్నవారికిచ్చి పెళ్లి చేసి సొసైటీలో గౌరవంగా తలెత్తుకుని తిరగాలని మీరు అనుకునివుండొచ్చు.
కానీ పిల్లలు ఎవరితో సంతోషంగా ఉండగలరో అర్థం చేసుకుని ఆశీర్వదించండి, స్వేచ్ఛగా బ్రతకనీవండి.
రైతు అవతారమెత్తిన కలెక్టర్.. సీక్రెట్ ఆపరేషన్‌తో స్కామ్ బట్టబయలు!!