‘కస్టడీ’ కోసం సామ్ ని వాడేస్తున్న నాగ చైతన్య?
TeluguStop.com
నాగచైతన్య ( Naga Chaitanya ) హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ చిత్రం( Custody Movie ) ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాగచైతన్య ఈ మధ్య వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో నాగ చైతన్య పదే పదే సమంత ( Samantha ) గురించిన టాపిక్ వచ్చే విధంగా ప్లాన్ చేసినట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో సమంత పేరు వస్తే పట్టించుకోని నాగచైతన్య ఇప్పుడు మాత్రం పదేపదే సమంత పేరు వచ్చిన కూడా స్పందిస్తున్నాడు.
అలాగే సమంత పేరును తానే స్వయంగా తీస్తున్నాడు.అందుకు కారణం ఏంటి అంటూ కొందరు ఆసక్తిని కనబరుచుతూ ఉన్నారు.
ఈ సమయంలో నాగ చైతన్య తన సినిమా కస్టడీ ప్రమోషన్ కోసం సమంత పేరును వినియోగించుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల శాకుంతలం సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్య పై సమంత కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
తమ వివాహ బంధం విచ్ఛిన్నం అవ్వడానికి తాను కారణం కానే కాదు అంటూ చెప్పేందుకు ప్రయత్నించింది.
ఆ విధంగా నాగచైతన్య సమంత ఆ సమయంలో వార్తలు నిలిచారు. """/" /
దాంతో శాకుంతలం సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది.
అందుకే సమంత వినియోగించిన పబ్లిసిటీ స్టంట్ ని నాగచైతన్య ఉపయోగిస్తున్నాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
సమంత చేసినట్లుగానే ఈ మధ్య ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఏదో ఒక క్వశ్చన్ లేదా టాపిక్ సందర్భంగా సమంత పేరును నాగచైతన్య తీసుకుంటున్నాడు.
తద్వారా కస్టడీ సినిమా గురించి మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. """/" /
ఇది సినిమా ఓపెనింగ్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాగ చైతన్య మరియు సమంత ఇద్దరు కూడా విడిపోయిన తర్వాత ఎవరికి వారే అన్నట్లుగా సింగిల్ గానే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.
ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఇలాంటి టాపిక్స్ రావడం అది కూడా సినిమా ప్రమోషన్ కోసం ఇలా జరగడం ఏమాత్రం సభకు కాదు అంటూ వీరిద్దరినీ కామన్ గా అభిమానించే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రోజూ రొట్టెలు పెట్టిన మహిళకు కన్నీటి వీడ్కోలు పలికిన మూగజీవం.. వీడియో చూస్తే!