నాగ చైతన్య థ్యాంక్యూ.. పోస్టర్ తో రిలీజ్ డేట్ ఎనౌన్స్..!

నాగ చైతన్య థ్యాంక్యూ పోస్టర్ తో రిలీజ్ డేట్ ఎనౌన్స్!

మనం కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.మనం డైరక్టర్ విక్రం కె కుమార్, హీరో నాగ చైతన్య కాంబోలో థ్యాంక్యూ సినిమా వస్తుంది.

నాగ చైతన్య థ్యాంక్యూ పోస్టర్ తో రిలీజ్ డేట్ ఎనౌన్స్!

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఈరోజు చైతు పోస్టర్ తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.

నాగ చైతన్య థ్యాంక్యూ పోస్టర్ తో రిలీజ్ డేట్ ఎనౌన్స్!

సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న నాగ చైతన్య థ్యాంక్యూ సినిమాని జూలై 8న రిలీజ్ ఫిక్స్ చేశారు.

సినిమాలో చైతు సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.వరుస సూపర్ హిట్లు కొడుతూ కెరియర్ స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తున్న నాగ చైతన్య థ్యాంక్యూ సినిమాతో కూడా సత్తా చాటేలా ఉన్నాడని చెప్పొచ్చు.

ఈ సినిమాతో పాటుగా విక్రం కుమార్ తోనే దూత అనే వెబ్ సీరీస్ కూడా చేస్తున్నాడు అక్కినేని హీరో.

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ వెబ్ సీరీస్ ని నిర్మిస్తుండటం విశేషం.

మొత్తానికి నాగ చైతన్య మాత్రం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో సూపర్ ఫాం లో ఉన్నాడని చెప్పొచ్చు.

థ్యాక్యూ కూడా హిట్ అయితే చైతు కెరియర్ ఇంకాస్త క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.