అక్కినేని నాగ చైతన్య, విక్రం కె కుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ థ్యాంక్యూ.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.రాశి ఖన్నాతో పాటుగా మాళవిక నాయర్, అవికా గోర్ కూడా థ్యాంక్యూ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇప్పటికే థమన్ మ్యూజిక్ తో వచ్చిన రెండు సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇక జూలై 8న రిలీజ్ అనుకున్న ఈ సినిమా ఇంతవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు.
అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే జూలై 8 అనుకున్న రిలీజ్ కాస్త రెండు వారాల తర్వాత అంటే జూలై 22కి వాయిదా పడ్డదని తెలుస్తుంది.
వరుస సూపర్ హిట్లతో ఓ రేంజ్ లో ఫాం లో ఉన్నాడు నాగ చైతన్య.
ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న చిన బంగార్రాజు థ్యాంక్యూ మూవీతో డబుల్ హ్యాట్రిక్ కి నాంది పలకాలని చూస్తున్నాడు.
థ్యాంక్యూ సినిమా మీద చైతు చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.థ్యాంక్యూ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రం కుమార్ తో ధూత అనే వెబ్ సీరీస్ కూడా చేస్తున్నాడు.
నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న ధూత వెబ్ సీరీస్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.