Naga Chaitanya : సమంత విషయంలో లేవని నోరు రష్మిక విషయంలో లేస్తుందేంటీ చైతూ..భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న( Rashmika Mandanna ) ఒకరు ఈమె కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక ప్రస్తుతం వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా రష్మికకు సంబంధించినటువంటి ఒక ఫేక్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
కొందరు ఆకతాయిలు ఈమె ఫేస్ మార్ఫింగ్ చేస్తూ ఒక బోల్డ్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
అయితే ఈ వీడియో పై ఎంతో మంది సెలెబ్రెటీలు స్పందిస్తూ ఇలా ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్న వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ రష్మికకు మద్దతు తెలుపుతున్నారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఏ హీరో కూడా ఈ విషయంపై స్పందించలేదు కానీ నాగచైతన్య ( Nagachaitanya ) మాత్రమే ఈ విషయంపై స్పందిస్తూ ఇది చాలా బాధాకరమని ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్ష పడాలి అంటూ కూడా ఈయన ఈ వీడియో పై స్పందిస్తూ రష్మికకు మద్దతు తెలిపారు.
"""/" /
ఇలా ఒక హీరోయిన్ ఫేక్ వీడియో పట్ల హీరో స్పందించడం మంచి విషయమే అయినప్పటికీ నాగచైతన్య పట్ల సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి.
నాగచైతన్య ఇలా రష్మిక వీడియో పై స్పందించడంతో పలువురు నెటిజెన్లు అలాగే సమంత అభిమానులు ఈయన స్పందన గురించి మాట్లాడుతూ ట్రోల్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా రష్మిక వీడియో పై స్పందించలేదు అయినా మీరు ఒక్కరే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు అంటూ కొందరు ఈ వీడియో పై కామెంట్ చేయక మరికొందరు మాత్రం సమంత( Samantha ) ప్రస్తావన తీసుకువస్తూ టోల్ చేస్తున్నారు.
"""/" /
సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే.
ఇలా విడాకుల సమయంలో సమంత గురించి భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.ఈమె విడాకులకు కారణాలు పలు ఎఫైర్స్ అంటూ కూడా వార్తలు వచ్చాయి.
ఇక తాను పూర్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెడ్ పై ఉన్నప్పుడు కూడా ఎంతోమంది తాను క్షేమంగా తిరిగి కోలుకోవాలని భావించారు ఆ సమయంలో కూడా నాగచైతన్య స్పందించలేదు.
"""/" /
ఇలా విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ సహనటిగా ఆమెను పరామర్శించవచ్చు కానీ నాగచైతన్య ఆ పని చేయలేదు.
అలా అప్పుడు సమంత విషయంలో మౌనం వహించినటువంటి నాగచైతన్య ఇప్పుడు రష్మిక విషయంలో ఎందుకు రియాక్ట్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున ఈయనపై ట్రోల్స్ జరుగుతున్నాయి.
రష్మిక పట్ల ఇంత ఇంట్రెస్ట్ నాగచైతన్యకు ఏంటి అంటూ భారీ స్థాయిలో ఈయనపై ట్రోల్స్ చేయడమే కాకుండా సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
అరెస్టుకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన కస్తూరి.. నేనేం పారిపోలేదంటూ?