ప్రో కబడ్డీ కోసం నాగ చైతన్య సాంగ్ అదిరింది..!

కబడ్డి ప్రీమియర్ లీగ్ గా వస్తున్న ప్రో కబడ్డీ 8వ సీజన్ కు రెడీ అవుతుంది.

ఈ ప్రో కబడ్డీ తెలుగు టైటాన్స్ టీం కి ఈసారి అక్కినేని హీరో నాగ చైతన్య బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడని తెలుస్తుంది.

దీనికి సంబందించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.రా చూద్దాం చేతులే సుత్తులైతే కాళ్లే స్థంభాలైతే అంటూ మోటీవేషనల్ గా ఈ సాంగ్ ఉంది.

తెలుగు టైటాన్ టీం ను ఎంకరేజ్ చేస్తూ నాగ చైతన్య చేసిన ఈ సాంగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు.

త్వరలో స్టార్ కానున్న ప్రో కబడ్డీ ఛాంపియన్ షిప్ లో తెలుగు టైటాన్స్ కు సపోర్ట్ గా నాగ చైతన్య ఉన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే సూపర్ ఫాం లో ఉన్న నాగ చైతన్య ఈమధ్యనే లవ్ స్టోరీ అంటూ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

నాగ చైతన్య కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ సందర్భంగా ప్రో కబడ్డీకి అతను బ్రాండింగ్ చేయడం విశేషం.

చైతు నెక్స్ట్ సినిమా థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు.విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో రాబోతుంది.

ఆదివారం వస్తే బాలయ్య ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారా… ఆ పని అస్సలు చేయరా?