మహేష్ కోసం ఆ పని చేసిన నాగ చైతన్య!

ప్రెసెంట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.

ఇక ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య మీడియా ముందుకు వచ్చి పలు ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ ఇంటర్వ్యూ లో నాగ చైతన్య పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక త్యాగం చేసినట్టు చైతన్య స్వయంగా తెలిపారు.

నాగ చైతన్య ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ గురించి మాట్లాడారు.

ప్రెసెంట్ మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం విషయం తెలిసిందే.

"""/"/ అయితే పరశురామ్ మహేష్ కంటే ముందే నాగ చైతన్య తో సినిమా చేయాలనీ అనుకున్నాడట.

పరుశురాం చెప్పిన స్క్రిప్ట్ కు చైతన్య ఓకే చేసాడట.అయితే అంతకంటే ముందే మహేష్ కు కూడా స్క్రిప్ట్ వినిపించాడట.

అయితే మహేష్ అప్పటికి పరశురామ్ కు ఓకే చెప్పలేదట.అందుకే పరశురామ్ నాగ చైతన్య తో సినిమా స్టార్ట్ చెయ్యాలని అనుకున్నాడట.

"""/"/ అయితే ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందే మహేష్ ప్రాజెక్ట్ ఓకే చెయ్యడంతో పరశురామ్ ముందు మహేష్ సినిమాను తెరకెక్కిస్తానని చైతన్యకు తెలిపాడట.

దీంతో చైతన్య మహేష్ కోసం తన ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాడట.ఈ విషయాన్నీ మీడియాకు చైతన్య తెలిపాడు.

ఇక చైతన్య లవ్ స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండడంతో చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా రిజల్ట్ ధీమాగా ఉన్నారు.

సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో మూవీ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?