అమీర్ ఖాన్ పై పొగడ్తలు కురిపించిన చైతూ.. చెన్నై ప్రొమోషన్స్ లో బిజీ బిజీ!

అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా.

అద్వైత్ చందం డైరెక్టర్ చేసిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఈ ఏడాది పెద్ద సినిమాల్లో ఒకటిగా రిలీజ్ కాబోతుంది.బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నారు.

ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా హిట్ అందుకోలేదు.

ఇదే క్రమంలో సౌత్ సినిమాలు అక్కడ వందల కోట్లు వసూలు చేస్తున్నారు.అందుకే ఎలా అయినా ఈ సినిమా అక్కడ హిట్ అయితేనే పరువు కాపాడు కోవచ్చు అని ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా కోసం మన తెలుగు సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటించాడు.

ఇది తనకు మొదటి డెబ్యూ సినిమా.అందుకే అమీర్ ఖాన్ తో పాటు నాగ చైతన్య కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

తాజాగా అమీర్ ఖాన్, చిరంజీవి, నాగ చైతన్య చెన్నై ప్రొమోషన్స్ లో పాల్గొన్నారు.

"""/"/ ఇందులో భాగంగా చైతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నారు.

ఈయన చెన్నై ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.నేను చెన్నై లోనే 18 ఏళ్ళు పెరిగాను.

ఇక్కడి కుర్రాడినే నేను.సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా చెన్నైకి మొదటిసారి రావడం చాలా సంతషంగా ఉంది.

లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటించే అవకాశం కలిపించిన అమీర్ ఖాన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాను.

నేను ఆయన నుండి చాలా నేర్చుకున్నాను.అంటూ అమీర్ పై పొగడ్తలు కురిపించాడు.

ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.మరి ఈ సినిమా చైతూకి ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

110 ఏళ్లు వయసులోనూ కారు డ్రైవ్ చేస్తున్న వృద్ధుడు.. ఆయన సలహా ఏంటంటే..?