వింటేజ్ టచ్ లో ”టైం లెస్ లవ్”.. ‘కస్టడీ’ సాంగ్ అదిరిందిగా!

అక్కినేని యంగ్ హీరోల్లో నాగ చైతన్య (Naga Chaitanya) ఒకరు.చైతూ నటన పరంగా ప్రేక్షకులను మెప్పించి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.

ఇక ప్రెజెంట్ నాగ చైతన్య చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'కస్టడీ' (Custody) .

అయితే నాగ చైతన్య వరుస ప్లాప్స్ తో రేసులో వెనుక ఉన్నాడు.'థాంక్యూ' సినిమాతో స్టార్ట్ అయిన ప్లాప్స్ పరంపర ఆ తర్వాత లాల్ సింగ్ చడ్డా వరకు వచ్చింది.

"""/" / దీంతో చైతూ కస్టడీ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.రెండు ప్లాప్స్ పడడంతో ఆచితూచి సినిమాలు చేస్తూ సెలక్టివ్ గా కథలను ఎంచుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే ఈసారి తమిళ్ డైరెక్టర్ కు నాగ చైతన్య ఛాన్స్ ఇచ్చాడు.

నాగ చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న కస్టడీ సినిమా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.

"""/" / తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్నారు.

వరుసగా రెండు ప్లాప్స్ పడిన కూడా ఈ సినిమాకు భారీగానే బడ్జెట్ పెడుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరిని ఆకట్టు కుంటుంది.మరి తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ (Custody Song) ను రిలీజ్ చేసారు మేకర్స్.

''టైం లెస్ లవ్'' (Timeless Love Lyrical) అంటూ సాగుతున్న ఈ సాంగ్ ఆకట్టు కుంటుంది.

అంతేకాదు ఈ సాంగ్ మొత్తం కంప్లీట్ వింటేజ్ టచ్ లో కనిపిస్తుంది.యువన్ శంకర్ రాజా ఇచ్చిన బీట్స్ ఈ సాంగ్ ను ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా చేసింది.

అలాగే ఏ ఎసొంగ్ లో చైతూ కృతి శెట్టి లుక్స్ కూడా మెస్మరైజ్ చేస్తున్నాయి.

కాగా ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందిస్తున్నారు.

అలాగే ఈ సినిమా మే 12న సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.మరి చైతూ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

మేం చాలా రిచ్, శ్రీమంతులం.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?