శోభితతో పెళ్లి జీవితం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్యకు( Naga Chaitanya ) మంచి గుర్తింపు ఉండగా మరికొన్ని రోజుల్లో తండేల్( Thandel ) సినిమాతో చైతన్య ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
శోభితతో( Sobhita ) పెళ్లి గురించి చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
తండేల్ సినిమా ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాతో నాగచైతన్య కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
లవ్ స్టోరీ సినిమా తర్వాత చైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో రిపీట్ అవుతుండటం గమనార్హం.
నా వైవాహిక జీవితం చాలా బాగుందని చైతన్య పేర్కొన్నారు.ప్రస్తుతం లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని మా పెళ్లి జరిగి కొన్ని నెలలే అయిందని నాగచైతన్య వెల్లడించారు.
ఒకవైపు ఇద్దరం కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే మాకంటూ ప్రత్యేక సమయం కేటాయించుకుంటున్నామని నాగచైతన్య తెలిపారు.
"""/" /
నాగచైతన్య రెమ్యునరేషన్( Naga Chaitanya Remuneration ) పరంగా కూడా టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే.
వర్క్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవడం మా ఇద్దరికీ ఉన్న కామన్ లక్షణాలలో ఒకటని చైతన్య వెల్లడించారు.
సినిమాపై మాకున్న ప్రేమ మాటల్లో చెప్పలేమని చైతన్య కామెంట్లు చేశారు.జీవితంపై మాకు ఎంతో ఆసక్తి ఉందని నాగచైతన్య వెల్లడించడం గమనార్హం.
"""/" /
మాకు ట్రావెలింగ్( Travelling ) అంటే చాలా ఇష్టమని భవిష్యత్తులో నేను, శోభిత కలిసి ఒకే సినిమాలో నటిస్తానని నాగచైతన్య వెల్లడించారు.
మంచి స్క్రిప్ట్ వస్తే నటించడానికి అభ్యంతరం లేదని నాగచైతన్య చెప్పగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.నాగచైతన్య తమిళం, ఇతర భాషల్లో మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
విందు భోజనం పెట్టిన భారత కుటుంబం.. కన్నీళ్లు పెట్టుకున్న రష్యన్ టూరిస్ట్!