నాగ చైతన్య పెళ్లి అయింది…ఇక ప్రొఫెషనల్ లైఫ్ మీద ఫోకస్ పెడితే మంచిది…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది.ఇక ప్రస్తుతం నాగచైతన్య( Naga Chaitanya ) శోభిత ధూళిపాళ్ల( Sobhita Dhulipala ) ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ పెళ్లితో అక్కినేని కుటుంబంలో గానీ వాళ్ల అభిమానుల్లో కానీ పండగ వాతావరణం అయితే నెలకొంది.
మరి వీళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక ముఖ్యంగా నాగచైతన్య చాలా రోజులు తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే సమంతతో( Samantha ) విడిపోయిన తర్వాత నుంచి నాగచైతన్య కొంతవరకు డిప్రెషన్ లో అయితే ఉంటున్నాడు.
అప్పటి నుంచి మంచి సినిమాలను కూడా చేయడం లేదు.ఒక ఆయన చేసిన సినిమాల్లో కూడా తను పెద్దగా ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపించడం లేదు.
ఇక ఎట్టకేలకు శోభిత దూళిపాళ్లతో వివాహం అయితే జరిగింది. """/" /
కాబట్టి ఇక మీదట నుంచి తను సినిమాల మీద భారీగా ఫోకస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు కొద్ది రోజులపాటు పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత తన సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా నాగచైతన్య లాంటి హీరో ఇండస్ట్రీలో టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్లాలంటే వరుసగా పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకొని సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరం అయితే ఉంది.
"""/" /
ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో( Thandel Movie ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతుంది.తద్వారా ఆయన కెరియర్ ఏ విధంగా ముందుకు దూసుకెళ్ళబోతుంది అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికైతే నాగచైతన్య ప్రొఫషనల్ లైఫ్ పరంగా సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఎందుకంటే తన తోటి హీరోలు తనకంటే ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఆయన కూడా భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.
భారతీయుల అక్రమ రవాణా .. యూకేలో ఇద్దరు వ్యక్తులకు జైలు