సమంతను నాగచైతన్య ఎందుకు కలుస్తాడు రా బాబు.. ఆపండ్రోయ్!
TeluguStop.com
సమంత దీర్ఘ కాలిక వ్యాధి మయో సైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ఆమె మరి కొన్నాళ్ల పాటు ఆ సమస్యను ఎదుర్కోవాల్సిందే అని.బెడ్ పై ఆమె ఉండాల్సిందే అని వైద్యులు అన్నారట.
ప్రస్తుతం కోలుకుంటున్న ఆమె పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వార్తలు వస్తున్నాయి.
సమంతగా త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది.
చిరంజీవి, ఎన్టీఆర్ తో పాటు అక్కినేని హీరోలైన అఖిల్ మరియు సుశాంత్ లో కూడా గెట్ వెల్ సూన్ అంటూ మెసేజ్ చేయడం జరిగింది.
ఈ సమయం లోనే నాగ చైతన్య నుండి ఎలాంటి స్పందన వస్తుందా అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
నాగచైతన్య మరియు సమంత విడిపోయారు, విడాకులు తీసుకున్న తర్వాత వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు అసలే లేవు.
అయినా కూడా సమంత అనారోగ్య విషయం తెలిసి వెంటనే నాగ చైతన్య ఆమె వద్దకు వెళ్లాడు.
వెళ్తాడు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. """/"/
అది నూటికి నూరు పాలు అబద్ధం అయ్యి ఉంటుంది.
ఎందుకంటే విడాకులు తీసుకున్న వారు మళ్లీ కలవడం ఇద్దరికీ కూడా మధ్య చాలా పెద్ద గొడవలు జరిగాయని అందుకే విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది.
విడాకుల తర్వాత వారిద్దరు కనీసం స్నేహితులుగా కూడా కొనసాగే అవకాశం లేదని పలు సందర్భాల ద్వారా నిరూపితమైంది.
అలాంటి వారిద్దరూ ఈ సందర్భంగా కలుస్తారు అంటే కచ్చితంగా లేదు అనే సమాధానం ఇండస్ట్రీ వర్గాల ద్వారా వినిపిస్తుంది.
ఒక వర్గం మీడియా వారు ఈ విషయమై ఓవర్ గా రియాక్ట్ అవుతూ కథనాలు ప్రచరితం చేస్తున్నారు.
సమంత మరియు నాగ చైతన్య మధ్య కలయిక అనేది అస్సలు జరగదు.సమంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా నాగ చైతన్య కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా స్పందించే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
విడాకుల తర్వాత వారిద్దరి మధ్య స్నేహం అనేది కొనసాగితే అప్పుడు నాగ చైతన్య ఆమె వద్దకు వెళ్లాడు అంటే నమ్మడానికి ఉంది.
కానీ ప్రస్తుతానికైతే అలా ఏమీ జరగక పోవచ్చు అని చాలా మంది భావిస్తున్నారు.
పెళ్లికి ముందే శోభితకు నాగచైతన్య అలాంటి కండిషన్ పెట్టాడా… వామ్మో?