సమంత చైతూకి భయపడిందా.. అందుకే వెనక్కి తగ్గిందా?

టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య,సమంత విడాకులు తీసుకొని విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

విడాకులు తీసుకొని కొన్ని నెలలు కావస్తున్నా కూడా వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

విడాకుల తరువాత ఇద్దరూ ఎవరి కెరీర్ పరంగా వాళ్ళు బిజీబిజీగా మారారు.ఇకపోతే సమంత తాజాగా నటించిన చిత్రం యశోద.

ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.

ఈ యశోద సినిమాను ఆగస్టు 12న విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అలాగే నాగచైతన్య నటించిన హిందీ సినిమా లాల్ సింగ్ చద్దా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానున్న విషయం తెలిసిందే.

అయితే విడుదల తేదీకి కేవలం ఒక్క రోజే సమయం ఉండడంతో నాగచైతన్య సమంత మధ్య గట్టిగానే పోటీ ఉంది అని అందరూ అనుకుంటున్నారు.

కానీ యశోద సినిమాను ఆగస్టు 12న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర బృందం ఉన్నపలంగా సినిమా డేట్ ను పోస్ట్ పోన్ చేశారట.

"""/" / అయితే రిలీజ్ డేటును పోస్ట్ ఫోన్ చేయడానికి సినిమాకు సంబంధించిన కొన్ని కారణాలే అని అని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఇదే విషయంపై కొంతమంది చైతన్యకు భయపడే సమంత కాస్త వెనక్కి తగ్గిందేమో అన్న విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఈ విషయంపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.కాగా సమంత ప్రస్తుతం చేతినిండా వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక మందన్న… తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి!