అమీర్ ఖాన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న నాగ చైతన్య
TeluguStop.com
కింగ్ నాగార్జున టాలీవుడ్ సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు బాలీవుడ్ లో క్యామియో పాత్రలు, సెకండ్ హీరో రోల్స్, డైరెక్ట్ సినిమాలు చేస్తూ వచ్చాడు.
ఈ నేపధ్యంలో నాగార్జునకి బాలీవుడ్ కొంత వరకు ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటించాడు.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ఇప్పుడు తండ్రి దారిలోనే కొడుకు కూడా బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తుంది.
నాగార్జున వారసుడుగా నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఏకంగా మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి చేయబోతున్నాడు.
అమీర్ ఖాన్ ప్రస్తుతం ఇంగ్లీష్ మూవీ ఫారెస్ట్ గంప్ కి అఫీసియాల్ రీమేక్ గా లాల్ సింగ్ చద్దా అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో సిక్కు వ్యక్తిగా అమీర్ ఖాన్ కనిపించబోతున్నాడు.ఇందులో ఒక సౌత్ హీరో పాత్ర కూడా ఉంది.
దీని కోసం ముందుగా విజయ్ సేతుపతిని ఫైనల్ చేశారు.అయితే అతను కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నాడు.
ఇప్పుడు ఆ పాత్ర కోసం నాగ చైతన్యని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.బాలీవుడ్ మూవీ అది కూడా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో చిత్రం కావడం నాగార్జున సూచన మేరకు చైతూ సినిమాలో నటించడానికి ఒకే చెప్పేశాడు.
తాజా సమాచారం మేరకు అతడు మే నుంచి తన షెడ్యూల్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ - నాగచైతన్యపై చిత్రీకరణ సాగనుందని వెల్లడైంది.
దీనికోసం నెలరోజుల కాల్షీట్లను చైతన్య ఇచ్చారని సమాచారం ఏదేమైనా సరైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
నిరూపించుకోవాల్సిన టైమ్ వచ్చిందన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట.అమీర్ లాంటి అగ్ర హీరో మూవీ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అక్కినేని హీరోపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
డిజాస్టర్ అని అప్పుడు డిక్లేర్ చేయండి.. రివ్యూల గురించి నాని షాకింగ్ రియాక్షన్ ఇదే!