ఈసారి సైలెంట్ గా వచ్చిన అక్కినేని హీరో.. పట్టించుకునేవారు ఎక్కడ?
TeluguStop.com
అక్కినేని హీరో నాగ చైతన్య( Nagachaitanya ) నటించిన కస్టడీ సినిమా( Custody Movie ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు.
కానీ దురదృష్టం కొద్ది సినిమా నిరాశ పర్చింది.తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు( Venkat Prabhu ) ఎన్నో సూపర్ హిట్ సినిమా లను రూపొందించాడు.
కానీ ఆయన రూపొందించిన ఈ సినిమా ఆ సూపర్ హిట్ చిత్రాల జాబితా లో నిలువడంలో విఫలం అయ్యాయి.
ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయిన కథ మరియు కథనం కారణంగా కస్టడీ సినిమా ను జనాలు తిరష్కరించారు అనే విషయం తెల్సిందే.
తాజాగా ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రముఖ ఓటీటీ ఈ వారం ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేయడం జరిగింది.
ఈ సినిమా యొక్క ఓటీటీ స్ట్రీమింగ్( Custody Movie In OTT Streaming ) ను సైలెంట్ గా చేయడం ను కొందరు తప్పబడుతున్నారు.
"""/" /
అంత సింపుల్ గా నాగ చైతన్య సినిమా ను ఎలా స్ట్రీమింగ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పెద్ద ఎత్తున నాగ చైతన్య కస్టడీ సినిమాను ప్రచారం చేసి ఆ తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసి ఉంటే బాగుండేది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం చేస్తున్న హంగామా కారణంగా అక్కినేని నాగ చైతన్య అభిమానులు మరియు ఇతర సినీ ప్రేమికులు కస్టడీ కోసం ఓటీటీ వైపు చూస్తున్నారు.
కొన్ని సినిమా లు థియేట్రికల్ రన్ లో ఫ్లాప్ అయినా కూడా ఓటీటీ లో సక్సెస్ అయిన దాఖలాలు ఉన్నాయి.
కనుక కస్టడీ సినిమా విషయంలో అదే జరిగేదేమో కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.కస్టడీ సినిమా నిరాశ తో వెంటనే చేయాలనుకున్న ఒక సినిమా ను కాస్త వాయిదా వేయడం జరిగింది.
మరో వైపు అల్లు అరవింద్ సమర్పణ లో బన్నీ వాసు నిర్మాణం లో ఒక సినిమా ను నాగ చైతన్య చేసేందుకు ఓకే చెప్పాడు.
ఆ సినిమా ఎప్పుడు మొదలు అవ్వబోతుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన