అనుపమ కీర్తి సురేష్ ఇద్దరిలో నాగ చైతన్య జోడి ఎవరు..?
TeluguStop.com
కస్టడీ ( Custody )ఫెయిల్యూర్ ని ఊహించని నాగ చైతన్య కొద్దిపాటి గ్యాప్ తో తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు.
చందు మొండేటి డైరెక్షన్ లోనే నాగ చైతన్య నెక్స్ట్ సినిమా ఉంటుందని తెలిసిందే.
గీతా ఆర్ట్స్ 2( Geeta Arts 2 ) బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.అంతేకాదు సినిమాలో హీరో పాత్ర చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉంటుందని టాక్.
ఆల్రెడీ ప్రేమం, సవ్యసాచి సినిమాలు చేసిన చైతన్య, చందు కలిసి హ్యాట్రిక్ గా చేస్తున్న సినిమా ఇది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ), కీర్తి సురేష్ ఇద్దరిలో ఒకరు నటిస్తారని తెలుస్తుంది.
కీర్తి సురేష్ కే మొదటి ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది.ప్రస్తుతం భోళా శంకర్ తర్వాత కీర్తి సురేష్ మరే సినిమా సైన్ చేయలేదు.
నాగ చైతన్యతో కీర్తి నటించడం సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది.ఆల్రెడీ నాగ చైతన్య కీర్తి సురేష్ మహానటి సినిమాలో కొన్ని సీన్స్ చేశారు.
ఈ కాంబో అక్కినేని ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.
ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగడం వల్ల ఏం అవుతుందో తెలుసా?