నాగచైతన్య శోభితలను కలిపిన హీరో అతనేనా.. ఈ హీరోకు థ్యాంక్స్ అంటూ?

ఇటీవల టాలీవుడ్ హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ(naga Chaitanya,sobhita Dhulipala) నిశ్చితార్థం సింపుల్‌గా జరిగిన విషయం తెలిసిందే.

సమంత, నాగ చైతన్య (Samantha, Naga Chaitanya)ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే తెలుగు ఇండస్ట్రీలో సమంత,నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు.

కానీ ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.

సమంత ఒంటిరిగా ఉండగా, నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య సైలెంట్‌ గా డేటింగ్ చేశాడు.

ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. """/" / త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కన్నారు.

కాగా వీరి పెళ్లికి సంబంధించిన పనులు కూడా మొదలు అయ్యాయి.శోభిత ధూళిపాళ(sobhita Dhulipala) నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది.

దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత ధూళిపాళ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు(ANR Award To Megastar Chiranjeevi) ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించిన కార్యక్రమం సోమవారం జరిగింది.ఈ కార్యక్రమానికి కాబోయే భార్య శోభిత ధూళిపాళతో కలిసి నాగ చైతన్య హాజరయ్యారు.

"""/" / శోభిత ధూళిపాళలను ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పరిచియం చేశారు నాగ చైతన్య.

ఈవెంట్‌లో నాగ చైతన్య,శోభిత ధూళిపాళ జంట స్పెషల్ ఎట్రాక్షన్‌ గా నిలిచింది.ఇదిలా ఉంటే అసలు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ కలుసుకోవడానికి, వారు ప్రేమించుకోవానికి ఒక హీరో కారణమని తెలుస్తోంది.

ఆ హీరో మరెవ్వరో కాదు అడవి శేషు(Adavi Sesu).శోభిత ధూళిపాళ అడవి శేష్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించింది.

గూడఛారి, మేజర్ సినిమాల్లో వీరు కలిసి నటించారు.గూడఛారి సినిమాలో నాగార్జున మేన కోడలు సుప్రియ కీలక పాత్రలో కనపించారు.

ఆ సినిమా షూటింగ్ చూద్దామని వెళ్లిన నాగ చైతన్యకు శోభిత పరిచయం కావడం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది.

ఇలా నాగచైతన్య - శోభితల పెళ్లి జరగడానికి కారణమయ్యాడు అడవి శేష్ అంటూ టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు.

ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మొటిమలతో ఇక మదన పడాల్సిన అవసరమే ఉండదు!