నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?

అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ( Sobhita Dhulipala ) ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు అంటూ గతంలో అనేకసార్లు వార్తలు వినిపించాయి.

కానీ ఆ వార్తలన్నీ కూడా ఆవాస్తవాలుగానే మిగిలిపోయాయి.ఎందుకంటే ఆ వార్తలపై అటు శోభిత కానీ, ఇటు నాగచైతన్య అతని ఫ్యామిలీ కానీ స్పందించలేదు.

దీంతో అవన్నీ ఒట్టి వార్తలే అని అనుకున్నారు. """/" / అయితే తాజాగా నిన్నటి నుంచి మరొకసారి వీళ్లిద్దరి పేర్లు సోషల్ మీడియా( Social Media )లో మారుమోగడంతో పాటు ఇద్దరు ఎంగేజ్మెంట్ వేడుక జరగనుంది అంటూ జోరుగా వార్తలు వినిపించాయి.

కానీ ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ శోభిత, నాగచైతన్య ఇద్దరు ఎంగేజ్మెంట్ వేడుకతో ఒక్కటయ్యారు.

చాలా కాలంగా రహస్య ప్రేమను కొనసాగించిన వీరిద్దరూ ఎట్టకేలకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజం చేశారు.

అయితే వీరి ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మొదట అందరూ షాక్ అయ్యారు.

కానీ ఆ తర్వాత మొదటి నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలే కదా, ఆ వార్తలనే వారు నిజం చేశారు అంటే కొంతమంది లైట్ తీసుకున్నారు.

"""/" / తాజాగా కింగ్ నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ గా ఏంగేజ్మెంట్ ను జరుపుకున్నారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ.నాగార్జున.

( Nagarjuna ).ట్విట్టర్ లో ఫోటోలు రిలీజ్ చేశారు.

కాగా సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి ఏజ్ గ్యాప్ విషయం గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

మరి వీరిద్దరి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉంది అన్న వివరాల్లోకి వెళితే.

వీరి మధ్య ఏజ్ గ్యాప్ 6 ఏళ్లు ఉన్నట్టు తెలుస్తోంది.1986 లో చైతన్య జన్మించగా, 1992 లో శోభిత జన్మించింది.

నాగచైతన్య నాగార్జున మొదటి భార్య రామానాయుడు కూతురు లక్ష్మీ సంతానం కాగా, శోభిత ధూళిపాళ తెలుగు అమ్మాయి తెనాలి అమ్మాయి.

మృతి చెందడానికి ముందు ఈ యువతి ఎంత హ్యాపీగా ఉందో చూస్తే..