వెంకీ మామ రిజెక్ట్ చేసిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లుడు చైతూ.. అంతగా నచ్చిందా!

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా కొన్ని కథలను కొందరు హీరోలు తిరస్కరిస్తే ఆ కథ నచ్చడంతో సినిమాలు చేస్తున్నారు.

ఇలా ఆ హీరో వదులుకున్న సినిమాలు విజయవంతం అయితే ఆ తరువాత సినిమాలను వదులుకున్న హీరోలు ఎంతో పశ్చాత్తాప పడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ తో దగ్గుబాటి వెంకటేష్ దగ్గరికి వెళ్ళారు.

కథ మొత్తం విన్న వెంకీ మామ కథ నచ్చక పోవడంతోనో లేదా ఇతర కారణాలతోనో ఈ సినిమాను తిరస్కరించారు.

దీంతో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అదే స్క్రిప్ట్ తో అల్లుడు నాగచైతన్య దగ్గరకు వెళ్లారు.

అయితే ఈ కథ నాగచైతన్యకు బాగా నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం వినబడుతుంది.

ఇలా మామ వద్దన్న కథకు అల్లుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

అయితే ఈ సినిమా ఏంటి అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. """/" / ఇక నాగచైతన్య విషయానికి వస్తే బంగార్రాజు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న థాంక్యూ చిత్రంలో నటిస్తున్నారు.

ఇందులో అవికాగోర్ రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా రష్యాలో షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇదే కాకుండా అమీర్ ఖాన్ తో పాటు నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా, అదేవిధంగా మరొక వెబ్ సిరీస్ లో నెగిటివ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2024: సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోతున్న బ్యాటర్లకు కళ్లెం వేస్తున్న టాప్ బౌలర్లు వీళ్లే..??