పాకీజాకు మోహన్ బాబు సాయం చేస్తే బాగుంటుందిగా.. నెటిజన్ల కామెంట్స్ వైరల్!
TeluguStop.com
పాకీజా.ఈతరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆతరం ప్రేక్షకులు ఈమెను ఇట్టే గుర్తుపట్టిస్తారు.
తెలుగు ఇండస్ట్రీలో 90 దశకంలో ఎన్నో సినిమాలలో నటించి అలరించింది.కాగా 90వ దశకంలో అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం లాంటి మంచు మంచి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.
అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఆమె పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.
కానీ పెళ్లి తరువాత తర్వాత భర్త శాడిస్ట్, తాగుబోతు కావడంతో ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.
దానికి తోడు అనేక ఆరోగ్య సమస్యలు రావడంతో సంపాదించుకున్న కాస్త డబ్బులు కూడా అయిపోయి ప్రస్తుతం ఒక హాస్టల్ లో నివసిస్తూ కాలం గడుపుతుంది.
అంతేకాకుండా ప్రస్తుతం ఆమె పరిస్థితి దయనీయంగా మారింది.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పాకీజా ప్రస్తుతం తనకు తినడానికి డబ్బులు కూడా లేవు అని చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ ఇంటర్వ్యూ చూసిన మెగా బ్రదర్ నాగబాబు తన వంతుగా లక్ష రూపాయలు సహాయాన్ని అందించారు.
తరువాత ఆమె నాగబాబుకి కృతజ్ఞతలు తెలుపగా ఆవిడ పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి కూడా మరొక లక్ష రూపాయల సహాయం అందించారు.
"""/"/
మెగాస్టార్ పాకీజాకి లక్ష రూపాయలు సహాయం అందించడంతో పాటుగా ఆమెకు సినిమాలలో టీవీ సీరియల్స్ లో అవకాశాలు ఇవ్వాల్సిందిగా దర్శకులకు విజ్ఞప్తి చేశారు.
ఆమెకు సినిమాలలో సీరియల్స్ లో అవకాశాలు వచ్చేలా చూస్తానని ఆమెకు భరోసా కూడా ఇచ్చారు.
దీంతో మెగా బ్రదర్స్ పై ప్రశంసలు కురిపిస్తూనే ఈ విషయంలోకి మోహన్ బాబుని లాగారు.
అసలు నాగబాబుతో కానీ మెగాస్టార్ చిరంజీవితో గాని పాకీజా కలిసి నటించలేదు.ఆమె మోహన్ బాబు తోనే సినిమాలలో నటించింది.
అటువంటిది ఆమె పరిస్థితి తెలిసి కూడా మోహన్ బాబు స్పందించకపోవడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"""/"/
ఇంకొందరు అయితే మోహన్ బాబు ఆమె పరిస్థితి తెలుసుకొని సహాయం చేస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం లాంటి సినిమాలు సూపర్ హిట్స్ కావడంలో పాకీజా పాత్ర కూడా ఎంతో ఉందని ఆ విషయాన్ని మరోసారి మోహన్ బాబుకు కామెంట్ల రూపంలో గుర్తు చేశారు.
ఇదే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు కూడా నడుస్తున్నాయి.మరి నెటిజెన్స్ కోరిక మేరకు పాకీజా విషయంలో మోహన్ బాబు స్పందించి ఆమెకు సహాయాన్ని అందిస్తారో లేదో చూడాలి మరి.
రాజమౌళి మహేష్ బాబు సినిమా మొదటి షెడ్యూల్ జరిగేది అక్కడేనా..?