పవన్ ను ఏడిపించడానికి అలా విమర్శించేవాళ్లం.. నాగబాబు షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు నటుడు నాగబాబు( Nagababu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
ఇకపోతే ప్రస్తుతం నాగబాబు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన సోదరుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నేతృత్వంలోని జనసేన పార్టీలో క్రియా శీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
అప్పుడప్పుడు జనసేన అలాగే తెలుగుదేశం పార్టీలకు సంబంధించి సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఉంటారు.
అలాగే ఆ పార్టీలపై విమర్శలు చేసే వారిపై కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారిపై మండిపడుతూ ఉంటారు.
"""/" /
ఇకపోతే సోషల్ మీడియా వేదికగా నా డైరీలో ఒక పేజీ అనే ప్రోగ్రాం ని నిర్వహిస్తున్న నాగబాబు రీసెంట్ గా అందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) గురించి ప్రేక్షకులతో కొన్ని విషయాలని పంచుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్బంగా నాగ బాబు మాట్లాడుతూ.అమితాబ్ బచ్చన్ గారు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీగా జరగలేదు.
అవకాశాల కోసం చాలా ఇబ్బంది పడ్డారు.అమితాబ్, రాజీవ్ గాంధీ మొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం వలన అమితాబ్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే వారు.
ఒకసారి ఇందిరా గాంధీ గారితో రికమండేషన్ లెటర్ ఇవ్వమని అమితాబ్ అడిగితే ఈ అబ్బాయి నాకు బాగా తెలిసిన అబ్బాయి.
బాగా యాక్ట్ చేస్తాడు ఒకసారి ట్రై చెయ్యండని ఇందిరాగాంధీ లెటర్ రాసి ఇచ్చేవారు.
"""/" /
అయినా కూడా అమితాబ్ కి అవకాశాలు వచ్చేవి కాదు.పైగా అమితాబ్ గారు సాధారణ వ్యకి కొడుకు వ్యక్తి కాదు.
ఆయన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ హిందీ సాహిత్య రంగంలో అద్భుతమైన పేరు ఉన్న వ్యక్తి కుడా.
మన తెలుగు నాట విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ శ్రీ ఎంత పెద్ద కవుల్లో హరివంశ రాయ్ బచ్చన్ కూడా అంత పెద్ద కవి.
ఇక అన్నయ్య చిరంజీవి దగ్గర నుంచి మా ఇంటిల్లిపాది మొత్తం అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్.
పవన్ కళ్యాణ్ కి అయితే చాలా విపరీతమైన అభిమానం.ఒక్కోసారి పవన్ ని ఏడిపించడానికి అమితాబ్ బచ్చన్ గారిని సరదాగా విమర్శించే వాళ్ళం.
దాంతో విపరీతమైన కోపం వచ్చి చేతిలో ఉన్న వస్తువుని విసిరేసేవాడని చెప్పుకొచ్చారు నాగ బాబు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్.. ఏం జరిగిందంటే?