ఆల్ టైం ఫేవరెట్ ఫోటో అంటూ అలాంటి ఫోటో షేర్ చేసిన నాగ్ అశ్విన్?
TeluguStop.com
కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.
ఈయన దర్శకత్వం వహించిన మూడవ సినిమాకే ఈ స్థాయిలో క్రేజీ సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
ఇలా కల్కి అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రభాస్( Prabhas ) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకుంది.
ఇప్పటికీ కలెక్షన్ల పరంగా ఎక్కడ వెనకడుగు వేయకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది.
"""/" /
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ పడిన కష్టం గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ సినిమా విడుదలైన రోజే ఈయన ఈ సినిమా కోసం తిరిగి తిరిగి కాళ్లకు చెప్పులు అరిగిపోయాయి అంటూ తన అరిగిపోయిన చెప్పుల ఫోటోలను కూడా షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
అయితే తాజాగా మరొక ఫోటోని షేర్ చేస్తూ ఆల్ టైం ఫేవరెట్ అంటూ ఈ ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.
"""/" /
ఈ ఫోటోలో భాగంగా ఒక మహిళ పాదాలకు పట్టిలు పెడుతూ ఉంది.
మరి ఈయన షేర్ చేసిన ఫోటో ఎవరిది, ఈ ఫోటోని షేర్ చేయడానికి గల కారణమేంటనే విషయాన్ని కూడా వెల్లడించారు.
ఆ పిక్ మరెవరిదో కాదు నటి శోభన( Sobhana ) ది.నా ఆల్‌టైమ్ ఫేవరెట్ శోభన లుక్ టెస్ట్‌కు సంబంధించిన ఫస్ట్ పిక్ ఇది అంటూ ఆమెపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ ఈయన షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది.
నటి శోభన చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కల్కి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఈ సినిమాలో ఈమె శంబాల ప్రజల నాయకురాలు మరియం( Mariyam ) పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తనకు తదుపరి సినిమా అవకాశాలు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.
ఒబేసిటీతో బాధపడుతున్న రష్యన్ పిల్లి.. బరువు తగ్గడానికి ఏం చేస్తుందో తెలిస్తే..?