ఆల్ టైం ఫేవరెట్ ఫోటో అంటూ అలాంటి ఫోటో షేర్ చేసిన నాగ్ అశ్విన్?

కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.

ఈయన దర్శకత్వం వహించిన మూడవ సినిమాకే ఈ స్థాయిలో క్రేజీ సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

ఇలా కల్కి అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రభాస్( Prabhas ) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకుంది.

ఇప్పటికీ కలెక్షన్ల పరంగా ఎక్కడ వెనకడుగు వేయకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది.

"""/" / ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ పడిన కష్టం గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ సినిమా విడుదలైన రోజే ఈయన ఈ సినిమా కోసం తిరిగి తిరిగి కాళ్లకు చెప్పులు అరిగిపోయాయి అంటూ తన అరిగిపోయిన చెప్పుల ఫోటోలను కూడా షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా మరొక ఫోటోని షేర్ చేస్తూ ఆల్ టైం ఫేవరెట్ అంటూ ఈ ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.

"""/" / ఈ ఫోటోలో భాగంగా ఒక మహిళ పాదాలకు పట్టిలు పెడుతూ ఉంది.

మరి ఈయన షేర్ చేసిన ఫోటో ఎవరిది, ఈ ఫోటోని షేర్ చేయడానికి గల కారణమేంటనే విషయాన్ని కూడా వెల్లడించారు.

ఆ పిక్‌ మరెవరిదో కాదు నటి శోభన( Sobhana ) ది.నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ శోభన లుక్‌ టెస్ట్‌కు సంబంధించిన ఫస్ట్‌ పిక్‌ ఇది అంటూ ఆమెపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ ఈయన షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది.

నటి శోభన చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కల్కి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఈ సినిమాలో ఈమె శంబాల ప్రజల నాయకురాలు మరియం( Mariyam ) పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తనకు తదుపరి సినిమా అవకాశాలు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

జబర్దస్త్ కి మరో కొత్త జడ్జ్… బుల్లితెరపై సందడి చేస్తున్న అందమైన జోడి!