అసిస్టెంట్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
TeluguStop.com
నాగ్ అశ్విన్( Nag Ashwin ) పరిచయం అవసరం లేని పేరు.ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన అనంతరం మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక త్వరలోనే కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్( Prabhas ) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. """/" /
ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇకపోతే డైరెక్టర్ నాగ్ అశ్విన్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు.
దర్శకుడిగా ఇది ఈయనకు నాలుగవ సినిమా.ఇలా నాలుగో సినిమాకే భారీ బడ్జెట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయన బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా నేటిజన్స్ ఆరా తీస్తున్నారు.
ఎవడే సుబ్రహ్మణ్యం( Yevade Subramanyam ) సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారు.
"""/" /
కాలేజీ రోజుల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు.
వీడియో ఎడిటింగ్ పై పట్టు సాధించారు.ఇక చిన్నప్పటినుంచి కథలు రాస్తూ ఉండే ఈయనకు సినిమాలపై ఉన్న మక్కువ చూసి తన తల్లి డైరెక్టర్ శేఖర్ కమ్ములకు( Sekhar Kammula )పరిచయం చేశారు.
ఇలా డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే సమయంలో 4 వేల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే వారు.
ఇది ఈయన మొదటి రెమ్యునరేషన్ కావడం విశేషం.
గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?