'ప్రాజెక్ట్ కె' సెట్ లోకి అడుగు పెట్టిన ప్రభాస్..!
TeluguStop.com
ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే(వర్కింగ్ టైటిల్) సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో అమితాబచ్చన్ పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ పూర్తి చేశారు.
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగులో గత వారం క్రితం దీపికా పదుకొనే జాయిన్ అయ్యారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అయ్యారు.
మొదటిసారిగా ప్రభాస్ ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టారు.ఈ షెడ్యూల్ పూర్తయ్యే వరకు ప్రభాస్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ షెడ్యూల్ శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పథకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
"""/" /
ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.ఇవే కాకుండా ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రాలలో కూడా నటిస్తున్నారు.
వెంబడించిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన రష్యన్ మహిళ.. వీడియో వైరల్..