నాగ్ అశ్విన్ ఫ్యామిలీ ఆ ఊరిలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించిందా. గ్రేట్ అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నాగ్ అశ్విన్( Nag Ashwin ) పేరు మారుమ్రోగుతుంది.
నాగ్ అశ్విన్ విజన్ కు ఫ్యాన్స్ షాకవుతున్నారు.నాగ్ అశ్విన్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో ఇప్పటివరకు ఎవరికీ పెద్దగా తెలియని నాగ్ అశ్విన్ జీవితానికి సంబంధించిన విషయాలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.
నాగ్ అశ్విన్ ది నాగర్ కర్నూలు జిల్లా( Nagar Kurnool ) తాడూరు మండలం ఐతోలు కాగా ఎవడే సుబ్రమణ్యం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు రాగా ఈ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాకు( Kalki Movie ) ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది.
హాలీవుడ్ తరహా స్టైలింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఊహించని స్థాయిలో మెప్పించిన సంగతి తెలిసిందే.
"""/" /
నాగ్ అశ్విన్ తల్లీదండ్రులు( Nag Ashwin Parents ) ఇద్దరూ డాక్టర్లు కాగా తల్లి గైనకాలజిస్ట్ గా తండ్రి యూరాలజిస్ట్ గా పని చేస్తున్నారు.
నాగ్ అశ్విన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు.నేను మీకు తెలుసా సినిమాకు నాగ్ అశ్విన్ ఏడీగా పని చేశారు.
శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు నాగ్ అశ్విన్ ఏడీగా చేయడం గమనార్హం.
"""/" /
నాగ్ అశ్విన్ కుటుంబ సభ్యులు స్వగ్రామంలో సాయిబాబా ఆలయాన్ని( Saibaba Temple ) నిర్మించడంతో పాటు ఆ ఆలయానికి సంబంధించిన బాధ్యతలు చూసుకుంటున్నారు.
నాగ్ అశ్విన్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.
నాగ్ అశ్విన్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
నాగ్ అశ్విన్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
వైరల్ వీడియో: ఎంతకు తెగించావురా.. కారు బ్యానెట్ పై మనిషి ఉన్నా కానీ..