చివరికి నువ్వు కూడా కాపీ కాట్స్ లిస్టులో చేరిపోయావా నాగ్ అశ్విన్.. ఎందుకు ఈ కక్కుర్తి !
TeluguStop.com
కల్కి సినిమా( Kalki 2898 AD )కు 700 కోట్ల బడ్జెట్ ఉంటే అందులో సగం రెమ్యునరేషన్లకే పోతుంది.
అంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి అందుబాటులో తక్కువ పేమెంట్స్ కి పని చేసే వారు లేనట్టు విదేశీయులను అలాగే విదేశీ సినిమాలకు పనిచేసే వారిని తెచ్చి మరీ చేయించుతున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ పై ఒక మరక పడింది.
ఇప్పటి వరకు అతడికి చెడ్డ పేరు లేదు.కానీ కల్కి సినిమాతో అది తుడిచిపెట్టుకుపోయేలా ఉంది.
ఏంటంటే ఇప్పటివరకు త్రివిక్రమ్, రాజమౌళి మాత్రమే కాఫీ ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు.రాజమౌళి( Rajamouli ) అయితే సీన్లకు సీన్లు ఎత్తేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అయితే ఆల్ లిస్టులో నాగ్ అశ్విన్ కూడా చేరడమే ప్రస్తుతం కొంతమందికి చివుక్కుమనిపిస్తోంది.
"""/" /
నాగ్ అశ్విన్.వైజయంతి మూవీస్ కోసం వాడిన లోగోని ఒక ఆ హాలీవుడ్ ఆర్టిస్ట్ అయినా సంగ్ చోయ్( Sung Choi ) చేసిన పని నుంచి అతడి CG ఆర్ట్ ను కాపీ కొట్టారని తెలుస్తోంది.
దీనిపై ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు.ఇండియన్ సినిమాలకు పని చేయాలనుకున్నాను.
వైజయంతి మూవీస్ వారు తనను వర్క్ చేయమని అడిగినా నాకు కుదరలేదు.ఇప్పుడు వారు చేసిన పని చూస్తే ఇకపై ఇండియన్ సినిమాలకు పని చేయాలని ఉద్దేశాన్ని మార్చుకుంటున్నాను.
పూర్తిగా ఓ సిజి ఆర్ట్ ని కల్కిలో ట్రైలర్ లో వచ్చిన వైజయంతి మూవీస్ లోగో కోసం వాడుకున్నారు.
దాన్ని నేను నిరూపించలేకపోవచ్చు.లీగల్ గా చాలా కష్టం కానీ ఆ పెయిన్ పని చేసిన ఆర్టిస్ట్ కే తెలుస్తుంది.
ఇలా దొంగలించడం వల్ల గొప్ప చిత్రాలను తీయలేరు అంటూ విమర్శలను గుప్పించాడు. """/" /
ఇప్పటి వరకు కథ లేదా సీన్లు, సంగీతాన్ని కాపీ కొట్టడం మాత్రమే చూసాము.
కానీ ఇలా ఆర్ట్ వర్క్ ని కూడా కాపీ కొట్టడమే చాలా దారుణంగా ఉంది.
ఇంతగా దరిద్రంలో ఎందుకు కూరుకుపోతుంది మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది అర్థం కావడం లేదు.
మన దగ్గర బోలెడంత టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా హాలీవుడ్ కి సంబంధించిన సినిమాల వర్కులను దొంగతనం చేయడం ఏంటి? ఇంతకన్నా నీచమైన ఆలోచన మరొకటి ఉంటుందా.
ఇక ఈ సినిమాలో అతిరథ మహారథులను తీసుకున్నారు.అమితాబ్, కమల్, ప్రభాస్, దీపికా, దిశ తో పాటు శోభన, అన్నా బెన్ వంటి వారు కూడా ఉన్నారు.
ఎంతో ఎఫెక్ట్స్ పెట్టి పనిచేసిన ఈ ప్రాజెక్టు కోసం ఇలా కాపీ ఆరోపణలు దక్కించుకోవడం అనే ఫలితం అయితే మంచిది కాదు.
ఇప్పటి వరకు ఎంతో మంచి పేరున నాగ్ అశ్విన్ ఇలా చేయడాన్నీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.
వాడివేడిగా డొనాల్డ్ ట్రంప్ – కమలా హారిస్ డిబేట్.. ఎవరిది పైచేయంటే