నయీమ్ కేసు రీ ఓపెన్ చేయాలి..: బండి సంజయ్

నయీమ్ కేసును రీ ఓపెన్ చేయాలని బీజేపీ నేత బండి సంజయ్ ( BJP Leader Bandi Sanjay )అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరినీ వదిలి పెట్టమంటున్నారన్న ఆయన ఎవరినైనా అరెస్ట్ చేస్తే కదా వదిలిపెట్టడానికి అని విమర్శించారు.

తన ఫోన్ తో పాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ( Kishan Reddy, Laxman ) ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బండి సంజయ్ తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ వెనుక మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.

రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు బీజేపీ నాయకులను హింసించారని తెలిపారు.ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ విషయంలో టైమ్ పాస్ చేయకండని బండి సంజయ్ సూచించారు.

బీట్ రూట్ జ్యూస్ త‌ల‌కు రాయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా?