నితిన్ సినిమాలో పవన్ అత్త.. ఏం చేస్తుందో?

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవల భీష్మ అనే సినిమాలో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.

ఈ సినిమాను పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో భీష్మ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ సాధించింది.

ఇక తన నెక్ట్స్ చిత్రం ‘రంగ్ దే’ను ఇప్పటికే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయబోయే ‘పవర్ పేట’ సినిమాలో నితిని చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో నితిన్ మూడు పాత్రల్లో నటించనున్నాడు.కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్ నటి నదియా నటించనున్నట్లు తెలుస్తోంది.

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో పవన్‌కు అత్తగా నటించిన నదియా, ఆ సినిమా సక్సెస్‌లో చాలా కీలక పాత్ర పోషించింది.

ఆ తరువాత పలు సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ వస్తోన్న నదియా, నితిన్ నటించిన ‘అ ఆ’ చిత్రంలోనూ అత్త పాత్రలో నటించింది.

ఆ సినిమా నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.ఇప్పుడు మరోసారి నితిన్ చిత్రంలో నదియా నటిస్తుండటంతో ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ