వైసీపీ ప్రభుత్వానికి నాదెండ్ల మనోహర్ ఛాలెంజ్..!

విశాఖ రాజధానిపై వైసీపీ ప్రభుత్వానికి జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఛాలెంజ్ చేశారు.

రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్దామన్న ఆయన ప్రజల్లోనే తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు.విశాఖ రాజధానిని ఎవరూ కోరుకోవడం లేదని నాదెండ్ల తెలిపారు.

విశాఖ క్యాపిటల్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు వెళ్లండని చెప్పారు.రాజధానిపై రోజుకు ఓ ప్రకటన చేస్తుంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు.

ఒక మంత్రి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు.మరో మంత్రి ఇదే రాజధాని అంటున్నారని విమర్శించారు.

మరోవైపు సీఎం విశాఖకు వెళ్తున్నా అంటున్నారన్నారు.సీఎం, మంత్రులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయ లబ్ధి కోసం బూటకపు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ మూవీ మళ్లీ వాయిదా పడిందా.. రాబిన్ హుడ్ డేట్ వెనుక రీజన్ ఇదేనా?