జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నాదెండ్ల మనోహర్..

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి: జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నాదెండ్ల మనోహర్.

దొరబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, రూ.5 లక్షల చెక్కు అందచేశారు.

జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈరోజు చల్లపల్లి వచ్చారు.జనసేన కార్యకర్త మెండు దొరబాబు గత కొంతకాలం క్రితం రోడ్డుప్రమాదంలో మృతిచెందారు.

కార్యకర్తల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా భీమా వర్తించటంతో రూ.5లక్షల చెక్కును దొరబాబు కుటుంబ సభ్యులకు మనోహర్ అందించారు.

కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.జనసేన పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

దేశంలో ఏ రాజకీయ పార్టీలో లేనివిధంగా కార్యకర్తల సంక్షేమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని భీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన నేతలు మత్తి వెంకటేశ్వరరావు, రాయపూడి వేణుగోపాలరావు, గుడివాక శేషుబాబు, ఉస్మాన్ షరీఫ్, చోడగం విమల్ కృష్ణలతో పాటు జిల్లా, మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters