అంగన్వాడీ వ్యవస్థ నిర్వహణపై వైసీపీ పాలకులకు చిన్న చూపు అంటూ నాదెండ్ల మనోహర్ సీరియస్..!!
TeluguStop.com
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్లు.ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని "ఛలో విజయవాడ"(
Chalo Vijayawada ) కార్యక్రమం చేపట్టారు.
జీతాలు పెంచాలని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ క్రమంలో అంగన్వాడీ వ్యవస్థ( Anganwadi System ) పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) సోషల్ మీడియాలో మండిపడుతూ సంచలన పోస్ట్ పెట్టారు.
"పేద మహిళలు, చిన్నారులకు సేవ చేసే అంగన్వాడీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడంలో వైసీపీ సర్కార్ విఫలమైంది.
గర్భవతులు, బాలింతలు, బిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా చూడటంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లు ఎంతో కీలకం.
వీరికి 2019 ఎన్నికల ముందు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలిచ్చారు. """/" /
వాటిని పాలనలోకి వచ్చాక విస్మరించారు.
తమకు ఇచ్చిన హామీలను వైసీపీ ( YCP ) పాలకులకు గుర్తు చేస్తూ, వాటిని నెరవేర్చాలని అడుగుతుంటే - అంగన్వాడీ మహిళలను అరెస్టులు చేసి భయపెట్టడం అప్రజాస్వామికం.
ప్రజాస్వామ్య రీతిలో నిరసనకు సిద్ధపడితే రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారు.ప్రభుత్వ వైఖరిని జనసేన పార్టీ ఖండిస్తుంది.
మాట ఇచ్చి మడమ తిప్పిన శ్రీ జగన్( CM Jagan ) అంగన్వాడీ మహిళలకు సమాధానం చెప్పాలి.
అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం తిరోగమన దిశలో ఆలోచనలు చేస్తుంది.మినీ అంగన్వాడీలను రద్దు చేయడం దురదృష్టకరం.
వైసీపీ పాలకులకు ఈ వ్యవస్థపైనా, నిర్వహణపైనా చిన్న చూపు ఉంది.అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ల పోరాటానికి జనసేన పార్టీ మద్దతు తెలియచేస్తుంది".
అనీ నాదెండ్ల మనోహర్ తెలియజేశారు.
బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ ఎన్ని లక్షలు సంపాదించారో తెలుసా?