'మహానాయకుడు' ఆ ఎపిసోడ్‌తో గట్టెక్కేలా కనిపిస్తుందే

రామ్‌ గోపాల్‌ వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' కారణంగా బాలకృష్ణ, క్రిష్‌ల 'మహానాయకుడు' చిత్రంను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.

మహానాయకుడు చిత్రం కంటే కూడా అధికంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

కథానాయకుడు మాదిరిగానే మహానాయకుడు కూడా మొత్తం పాజిటివ్‌ ఎలిమెంట్స్‌తో, ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటుందని, అదే వర్మ మూవీ అయితే ట్విస్ట్‌లు, గొడవలు అబ్బో చాలా ఉంటాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.

అందుకే అంతా కూడా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ సమయంలోనే మహానాయకుడు ట్రైలర్‌ విడుదల అయ్యింది.

ఈనెల 22న విడుదల కాబోతున్న మహానాయడకు మూవీ ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఎలాంటి వివాదాస్పద అంశాలు ఈ చిత్రంలో ఉండవని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఈ చిత్రంలో నాదెండ్ల ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంలో మొదటి కుదుపు నాదెండ్ల ఎపిసోడ్‌.ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో నాదెండ్ల ఎమ్మెల్యేలను తనవైపుకు లాక్కుని సీఎం అవుతాడు.

ఆ విషయాలను చూపిస్తారా లేదా అంటూ అంతా భావించారు.కాని ఆశ్చర్యకరంగా ఆ ఎపిసోడ్‌ సినిమాకు ఉంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఆ ఒక్క ఎపిసోడ్‌తో మహానాయకుడును చిత్రాన్ని నడిపించొచ్చు అంటూ బాలయ్య అండ్‌ కో భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మహానాయకుడు చిత్రంలో లక్ష్మీ పార్వతి గురించిన ప్రస్థావన అస్సలు ఉండదు.బసవతారకం చనిపోయిన తర్వాత ఏం జరిగిందనే విషయాలను చూపించకుండా వివాదాలకు తావు లేకుండా సినిమాను క్లోజ్‌ చేయబోతున్నారు.

మొత్తానికి ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రంను బాలకృష్ణ పెద్దగా ఆసక్తి లేకుండానే విడుదలకు సిద్దం చేస్తున్నాడు.

అయితే విడుదల సమయంలో మాత్రం ఆసక్తి రేకెత్తించేలా ట్రైలర్‌ను వదిలాడు.