జనసేనలో వారికే టిక్కెట్లు..తేల్చేసిన నాదెండ్ల..!!!

ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం ఎంతవరకూ ఉంటుందో తెలియదు కాని.

ఆ పార్టీ హడావిడి చూస్తుంటే మాత్రం అధికారంలోకి రాబోయేది ఆ పార్టీయే అనేట్టుగా ఉంది నేతల పరిస్థితి.

వైసేపీ , టీడీపీ పార్టీల నుంచీ సీనియర్ నేతల చేరికలు , రోజు రోజు కి జనసేనలో పెరుగుతున్నాయి.

దాంతో జనసేనలో కొత్త ఉశ్చాహం నిండుకుంటోంది.దాంతో టీడీపీ ని వదిలి జనసేనలోకి ఎంట్రీ ఇచ్చే నేతల లిస్టు భారీగా పెరగనుందనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఇలాంటి వారందరికీ జనసేనలో చేరిన మాజీ స్పీకర్ షాక్ ఇచ్చారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సీనియర్స్ జరా ఆగండ్రి అంటూ చెయ్యెత్తి ఆపేస్తున్నారు.

జనసేన లో టిక్కెట్లు ఇచ్చేది యువతకే అంటూ కుదబద్దలు కొట్టి మరీ చెప్పారు.

దాంతో ఒక్క సారిగా జనసేనలోకి వెళ్లాలని అనుకుంటున్నా జంపింగ్ లు ఒకింత ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

అయితే ఎందుకు నాదెండ్ల ఈ ప్రకటన చేశారు.ఈ ప్రకటన వెనుకాల వ్యూహం ఏమిటి అంటే.

అందుకు ప్రత్యేకమైన కారణం ఏమీలేదు.ముఖ్యంగా వివిధ పార్టీల నుంచీ నేతలు జనసేనలోకి వచ్చే సూచలనలు ఉండటంతో వారి చేరికలకి చెక్ పెట్టేందుకే నాదెండ్లతో ఇలాంటి ప్రకటనలు చేయించారని టాక్ వినిపిస్తోంది.

జనసేనలో ప్రస్తుతం ముఖ్య భూమిక పోషించేది ప్రస్తుతానికి నాదెండ్ల కాబట్టి ఆయనచేత ఈ ప్రకటన చేయిస్తే పార్టీలో నాదెండ్ల ఎంట్రీ తో రగులుతున్న అసంతృప్తి వర్గం, అదేవిధంగా పార్టీ లోకి రద్దు వలసలని కట్టడి చేయచ్చు అనేది పవన్ వ్యూహంగా తెలుస్తోంది.

అయితే Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.నాదెండ్ల చేసిన ప్రకటన ప్రకారం.

గతంలో ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన ప్రకటన ప్రకారం.జనసేనలో ముఖ్యంగా యువతకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

జంపింగ్ లకి అవకాసం ముందు నుంచీ చెప్పి ఇప్పుడు వారినే ప్రతీలో ప్రధాన వ్యక్తులుగా చేస్తున్నారు.

నాదెండ్ల మొదలు, తోట చంద్రశేఖర్ ఇలా చెప్పుకుంటూ పొతే లిస్టు పెద్దదే అవుతుంది.

మరి ఈ క్రమంలో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పుడు నాదెండ్ల కి టిక్కెట్టు ఇస్తారా.

?? చంద్రశేఖర్ కి టిక్కెట్టు ఉంటుందా.?? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే జనసేనలో యువతకి ఏ మాత్రం టిక్కెట్లు కేటాయిస్తారో వేచి చూడాల్సిందే.

రెమ్యునరేషన్ ను రెట్టింపు చేసిన హీరోయిన్ కీర్తి సురేష్.. పారితోషికం ఎంతంటే?