‘నా సామిరంగ’ నుండి అల్లరి నరేష్ ఇంట్రో.. అంజి పాత్రలో లుక్ అదిరింది!

అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) వచ్చే ఏడాది 2024 జనవరిలో పొంగల్ రేసుకు సిద్ధం అవుతున్నాడు.

నాగార్జున ''నా సామిరంగ'' ( Naa Saami Ranga ) అనే సినిమాను సంక్రాంతి బరిలో నిలిపనున్నాడు.

ఇప్పటికే షూట్ ఆల్మోస్ట్ పూర్తి చేయగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ అంత బిజీగా ఉన్నారు.

కాగా విజయ్ బన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మలయాళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ( Ashika Ranganath ) హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

"""/" / మరి రిలీజ్ కు నెల మాత్రమే ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

కొద్దిసేపటి క్రితం అల్లరి నరేష్ కు సంబంధించిన ఇంట్రో రిలీజ్ చేసారు.అంజి అనే పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నట్టు ఈ ఇంట్రో వీడియోలో చెప్పారు.

ఈ వీడియో గ్లింప్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. """/" / అల్లరి నరేష్, నాగార్జున మధ్య మంచి బాండింగ్ ఉండబోతుంది అని ఈ వీడియో చూస్తుంటే తెలుస్తుంది.

చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ తనదైన రోల్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు.

ఇక నాగార్జున పొంగల్ రేసులో అందరి కంటే ముందుగానే జనవరి 10 లేదంటే 11న వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

చూడాలి మరి ముందు వస్తే నాగ్ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో.

ఎన్టీఆర్ కటౌట్‌కు నిప్పు పెట్టిన దుండగులు.. పెద్దెత్తున మంటలు(వీడియో)