Actress Mallika : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన రవితేజ హీరోయిన్.. ఈ నటి గుర్తుందా?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Raviteja )నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే.

ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే చూసేవారు చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు.

2004లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఇక నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్( Naa Autograph Sweet Memories ) సినిమా పేరు వినగానే ముందుగా హీరోయిన్ విమల అలియాస్ మల్లిక( Heroine Vimala ) గుర్తుకు వస్తూ ఉంటుంది.

ఆ సినిమాలో ఆమె నటన ఎక్స్ప్రెషన్స్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరని చెప్పవచ్చు.ఆ సినిమాలో రవితేజ స్కూల్ డేస్ జీవితంలో విమల పాత్రలో నటించింది.

"""/" / ఆ తర్వాత మరే సినిమాలో కూడా ఆమె నటించలేదు.మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రను వేసుకుంది.

సినిమాలోని పాటలు విన్నా సినిమా చూసిన వెంటనే ఆమె గుర్తుకు వస్తూ ఉంటుంది.

అందం, అమాయకత్వం, సహజ నటనతో వెండితెరపై అలరించి మెప్పించింది మల్లిక.ఇండస్ట్రీలో అందం, టాలెంట్ అన్నీ ఉన్నా కూడా అవకాశాలు రావడంలో ఎంతోమంది వెనుకబడ్డారు.

అటువంటి వారిలో మల్లిక కూడా ఒకరు.చాలామంది హీరోయిన్లు అవకాశాలు రాక సినిమా ఇండస్ట్రీకి( Movie Industry ) దూరం అయ్యి ప్రస్తుతం ఫ్యామిలీ భర్త పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఈతరం ప్రేక్షకులలో చాలామందికి మల్లిక ఎవరు అన్నది కూడా చాలామందికి తెలియదు. """/" / కేరళకు చెందిన మల్లిక తెలుగుతో పాటు తమిళంలో తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపును తెచ్చుకుంది.

తమిళంలో గుండక్క మందక్క, తిరుపతి, తుంకుం నకుముమ్, తోట, చెన్నైయిల్ ఒరునార్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

కేవలం తమిళంలో మాత్రమె కాకుండా మలయాళం లో కూడా నటించి మెప్పించింది.అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించింది.

పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన మల్లిక ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.

ప్రస్తుతం ఆమెకు ఆమె ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా( Social Media )లో చెక్కర్లు కొడుతున్నాయి.

ఆ ఫోటోలు ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.

మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ హిట్ ఇవ్వగలడా.. ఆ ఫ్లాప్ చూసి టెన్షన్ మొదలైందిగా!