ఆ కార్య‌క్ర‌మంలో ఆ జిల్లా ముందున్న స‌మ‌న్వ‌యం కొర‌త‌..!!

రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార పార్టీ వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కార్య‌క్ర‌మం.గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం.

ఈ క్ర‌మంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జుల‌కు దిశా నిర్ధేశం చేశారు.

ఎట్టిప‌రిస్థితుల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఆదేశించారు.విడ‌త‌ల వారీగా స‌మావేశాలు పెట్టి నేత‌ల‌ను హెచ్చ‌రించారు.

ఎందుకంటే ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన స్పంద‌న‌తోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తాన‌ని అన్నారు.

అయితే ఏపీ మొతంలో ఈ కార్యక్రమాన్ని విజ‌య‌వంతంగ‌గా నిర్వహిస్తున్న జిల్లాలు కేవలం మూడు మాత్రమే అని నివేదిక అధిష్టానానికి అందింది.

ఈ మూడు జిల్లాల్లో.అవేంటంటే.

అనంతపురం, చిత్తూరు, కృష్ణా జిల్లా.ఈ మూడు జిల్లాల్లోనూ.

అనంతపురంలో మాత్రమే జోరుగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతున్నట్లు త‌మ పార్టీ సర్వేలో.

వెల్లడైనట్టు తాడేపల్లి వర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.అయితే అనంతపురంలో ప్రతి ఒక్కరూ గడపగడపకార్యక్రమంలో తిరుగుతున్నారు.

ఎక్కడా ఎవరూ కూడా బద్ధకించకుండా.ప్రజలతో మమేకం అవుతున్నారు.

అందుకే.ఇప్పుడు అక్కడ నిత్యం ఎమ్మెల్యేలు ప్రజల మధ్య కనిపిస్తున్నారనే నివేదిక అందుతోంద‌ని అంటున్నారు.

"""/"/ స‌క్సెస్ గా.ఇక చిత్తూరు కూడా ఈ కార్య‌క్ర‌మంలో ముందుంద‌నే చెబుతున్నారు.

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకు ని ఇక్కడి వైసీపీ నేత‌లు మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నారని ఆయన ఆదేశాల మేరకు వారానికి నాలుగు రోజులు విధిగా ప్రజల మధ్య ఉంటున్నారని పార్టీ అధిష్టానానికి రిపో ర్టు చేరిన‌ట్లు చెబుతున్నారు.

మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ గడప గడప కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు.విజయవాడ లోని మూడు నియోజకవర్గాలు సహా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజ‌య‌వంతం అవుతోంద‌ని అంటున్నారు.

అంతా బాగానే ఉన్నా క‌లివిడి క‌రువు.! అయితే అనంత‌పురం జిల్లాలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం బాగానే ఉన్నా ఇక్క‌డ మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు సీనియర్లు.

చాలా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీ కి ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు.

హిందూపురం నుంచి తాడిపత్రి వరకు కూడా నాయకుల మధ్య స‌మ‌న్వ‌యం లేదని.ఎవ‌రికి వారే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.

ఇలాగే కొన‌సాగితే ఈ జిల్లాలో పార్టీ న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంటున్నారు.అందుకే ఎన్నిక‌ల సమయానికి సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వారు చెబుతున్నారు.

ఈ జిల్లాలో పార్టీ విజ‌యం త‌ప్ప‌నిస‌రి అని అంటున్నారు.చూడాలి మ‌రి ఎలా స‌మ‌న్వ‌యం కుదురుస్తారో.

స్టార్ డైరెక్టర్ తో సినిమా కి కమిట్ అయిన నితిన్…