కోట్ల రూపాయల లాభాలు వస్తున్నా నో అంటున్న మైత్రి వారు

కోట్ల రూపాయల లాభాలు వస్తున్నా నో అంటున్న మైత్రి వారు

ఈమధ్య కాలంలో టాలీవుడ్‌ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అంటే ఏది అంటే ఠక్కున వినిపించే పేర్లలో మైత్రి మూవీ మేకర్స్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కోట్ల రూపాయల లాభాలు వస్తున్నా నో అంటున్న మైత్రి వారు

ఈ బ్యానర్‌ లో స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోల వరకు సినిమాలు చేస్తున్నారు.

కోట్ల రూపాయల లాభాలు వస్తున్నా నో అంటున్న మైత్రి వారు

వరుసగా ఈ బ్యానర్‌ నుండి సినిమాలు వస్తున్నాయి.ఇప్పటికే ఈ బ్యానర్‌ లో మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన' సినిమాను చేశాడు.

అది వైష్ణవ్‌ కు మొదటి సినిమా అనే విషయం తెల్సిందే.కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో అమ్మాలని కొందరు నిర్మాతలకు సలహా ఇస్తున్నారు.

థియేటర్లకు ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు.దాంతో ఖచ్చితంగా ఉప్పెన ఓటీటీ దారి పడుతుందని భావించారు.

కాని వైష్ణవ్‌ తేజ్‌ మొదటి సినిమా అవ్వడం వల్ల సినిమాకు సంబంధించిన ఒక సెంటిమెంట్‌ వైష్ణవ్‌ కు ఎప్పుడు ఉంటుంది కనుక మైత్రివారు అతడి కోసం కోట్ల ఆఫర్‌ వస్తున్నా కూడా ఓటీటీ రైట్స్‌ అమ్మేందుకు ఓకే చెప్పడం లేదు.

మైత్రి వారికి పెట్టిన పెట్టుబడికి డబుల్‌ లాభం ఇచ్చేందుకు ఒక ప్రముఖ ఓటీటీ రెడీగా ఉందట.

"""/"/ మెగా హీరో మొదటి సినిమా ఓటీటీలో విడుదల అయితే బాగోదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఉప్పెన సినిమా పాటతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

కనుక సినిమా కూడా తప్పకుండా బాగుంటుందని ఓటీటీ ద్వారా వచ్చే లాభం ఏదో థియేటర్ లో కూడా వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట.

పాక్ హైకమిషన్ ఆఫీసులో కేక్ కటింగ్? వీడియో వైరల్