ఒక్క మైత్రి మూవీస్..ఏకంగా 2000 కోట్లు ..టాప్ 10 హీరోస్
TeluguStop.com
2015 లో శ్రీమంతుడు సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది మైత్రి మూవీ మేకర్స్.
ఆ తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప వంటి పెద్ద సినిమాలు నిర్మించి కేవలం ఏడేళ్ల సమయంలోనే 15 కు పైగా సినిమాలు నిర్మించారు.
ఇక 2022 విషయానికి వస్తే సర్కారు వారి పాటతో వారి విజయ యాత్ర మొదలైంది ఆ తర్వాత అంటే సుందరానికి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హ్యాపీ బర్త్డే వంటి నాలుగు చిత్రాలు విడుదల చేశారు.
ప్రస్తుతం వీరి చేతిలో అన్ని పెద్ద హీరోల సినిమాలే ఉన్నాయి.ఎక్కడో మొదలైన మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పుడు టాలీవుడ్ లోని బడా నిర్మాణ సంస్థగా అవతారం ఎత్తారు.
చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీర సింహారెడ్డి, విజయ్ దేవరకొండ తో ఖుషి, నందమూరి కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా, అల్లు అర్జున్తో పుష్ప 2, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్.
జూనియర్ ఎన్టీఆర్ తో ఒక చిత్రం.రాంచరణ్ తో మరొక చిత్రం.
అభినవరెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అలా వీరి చేతిలో ప్రస్తుతం 9 చిత్రాల నిర్మాణం జరుగుతుంది.
మైత్రి మూవీ మేకర్స్ నుంచి కాల్ వచ్చింది అంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వారికి కాల్షీట్ ఇవ్వాల్సిందే.
"""/"/
దాదాపుగా ఈ సినిమాల నిర్మాణానికి వాటి మార్కెట్ విలువ ప్రకారం 1500 నుంచి 2000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు.
మరి ఇంత ఎత్తుకు ఎదిగిన మైత్రి మూవీస్ కి ప్రస్తుతం ఐటీ దాడుల వ్యవహారం తలనొప్పిగా మారింది.
సరే సినిమా ఇండస్ట్రీ లో ఇన్ని పెద్ద సినిమాలు చేస్తున్న వారికి ఈ మాత్రం తలనొప్పులు ఉండనే ఉంటాయి.
"""/"/
ఇక మైత్రి మూవీ మేకర్స్ అనే సంస్థను స్థాపించింది నవీన్ యెర్నేని, రవి శంకర్ మరియు మోహన్ చెరుకూరి.
సినిమా పైన ఉన్న ఫ్యాషన్ తోనే వీరు ఈ సంస్థను స్థాపించారు.మొదలు పెట్టిన సినిమానే పెద్ద హీరోతో కావడం తో ఆయనకు చెందిన అన్ని సినిమాలను వారే ఎక్కువగా నిర్మిస్తున్నారు.
ఇక భవిష్యత్తులో ఇప్పటికే పేరుకుపోయిన సిండికేట్ దందా ను పక్కకు పెట్టి ఇంకా పెద్ద సంస్థ అవతాటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
సొంతింటి కలను నిజం చేసుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. కల నెరవేరిందిగా!