డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన బైక్.. జనాలు చూసి షాక్..ఎలా జరిగిందంటే ?

మనం నిత్యం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎన్నో ప్రమాదాలను మన కళ్ళతో చూస్తూ ఉంటాం.

రోడ్డు మీద వాహనాలతో వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.మనం స్పీడ్ తక్కువుగా వెళ్తూ ఉన్న వేరే వాళ్ళ అజాగ్రత్తతో ప్రమాదాలు జరగవచ్చు.

కేవలం వాహనాలతో మాత్రమే కాదు రోడ్డు పక్కన కాలి నడకన నడవాలన్నా కూడా జనాలు భయ పడుతున్నారు.

కొన్ని యాక్సిడెంట్స్ జరిగే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.అలాంటి వింత ఘటన ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూసి నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు.అంతలా ఏం జరిగిందా అని అనుకుంటున్నారా.

ఒక బైక్ రోడ్డు మీద డ్రైవర్ లేకుండానే దానంతట అది వెళ్తూ కనిపించింది.

ఈ దృశ్యం చూసిన రోడ్డు మీద వెళ్లే వాహన దారులు, పక్కన నడిచి వెళ్తున్నవారు నోరు తెరుచుకుని మరి చూస్తూ ఉన్నారు.

అలా డ్రైవర్ లేకుండా బైక్ దానంతట అది ఎలా వెళ్లిందో వాళ్లకు అర్ధం కాలేదు.

ఈ ఘటన మహారాష్ట్ర లో చోటు చేసుకుంది. """/"/ అలా ఆ బైక్ డ్రైవర్ లేకుండానే 300 మీటర్లు దూరం వరకు వెళ్ళింది.

ఇదంతా సిసి టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.ఇప్పుడు అది కాస్త వైరల్ అయ్యింది.

పూణే, నాసిక్ హైవే పై ఈ ఘటన జరిగింది.బైక్ మీద వేగంగా వచ్చే ఒక వ్యక్తి పక్కన నడుస్తూ వెళ్తున్న పాదచారుడిని ఢీ కొట్టాడు.

"""/"/ అలా ఢీ కొట్టగానే ఆ బైక్ పైన వ్యక్తి కింద పడ్డాడు.

అతడు కింద పడినా కూడా బైక్ ఆగకుండా అలానే 300 మీటర్ల వరకు ముందు వెళ్తూ ఉంది.

అదే సమయంలో రోడ్డుపై వచ్చే వేరొక వాహనం ఈ బైక్ ఢీకొట్ట బోతుండడంతో ఆ డ్రైవర్ బ్రేక్ వేసి ఆపాడు.

దీంతో ఆ బైక్ కొద్దీ దూరం ముందుకు వెళ్లి కింద పడింది.ఇదంతా వీడియో రూపంలో బయటకు రావడంతో వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ మూవీ తొలిరోజు కలెక్షన్ల లెక్కలివే.. ఫస్ట్ డే రికార్డులు క్రియేట్ చేసిందిగా!