కన్నడ పవర్ స్టార్ కు అరుదైన గౌరవాన్ని ప్రకటించిన మైసూర్ యూనివర్సిటీ!

కన్నడ చిత్ర పరిశ్రమలోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పునీత్ రాజ్ కుమార్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

ఈ విధంగా కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటు కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఇలా అతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో ఎంతోమంది అభిమానులు ఇప్పటికీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉండగా నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణానంతరం ఆయనకు మైసూర్ యూనివర్సిటీ అరుదైన గౌరవాన్ని పురస్కరించుకుంది.

"""/"/ పునీత్ రాజ్ కుమార్ మరణించిన తరువాత మైసూర్ యూనివర్సిటీ సభ్యులు ఆయన భార్య అశ్విని సంప్రదించారు.

నటుడు పునీత్ రాజ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం గురించి మైసూర్ యూనివర్సిటీ సభ్యులు పునీత్ తో కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.

ఈ క్రమంలోని త్వరలో జరగబోయే స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు పునీత్‌ భార్య అశ్విని అంగీకరించారని మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ హేమంత్‌కుమార్‌ ఆదివారం చెప్పుకొచ్చారు.

ఈనెల 22న మైసూరు యూనివర్సిటీ 102వ స్నాతకోత్సవంలో పునీత్‌ కి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు.

రాజ్యసభ రేసులో మెగా బ్రదర్ ? టీడీపీ నుంచి సుహాసిని ?