అమ్మ ఏడ్చింది.. కర్మ ఎవ్వరినీ వదలదు.. సుమన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తెలుగు ప్రేక్షకులకు నటుడు సుమన్( Actor Suman ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమన్, ఆ తర్వాత దేవుడి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వచ్చారు.

అంతేకాకుండా సుమన్ పేరు వింటే చాలు చాలామందికి దేవుడి పాత్రే గుర్తుకొస్తూ ఉంటుంది.

ఒకప్పుడు పదుల సంఖ్యలో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

అయితే నిజం చెప్పాలంటే స్టార్ స్టేటస్ లో ఉండాల్సిన సుమన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడం వెనుక పెద్ద కథే ఉంది.

ఆయన్ని ఒక కేసులో ఇరికించి ఆరు నెలలు జైల్లో పెట్టిన ఘటన ఉంది.

"""/" / సుమన్‌ కెరీర్‌ లో అదొక చేయని చెరగని మచ్చలా మిగిలిపోయింది.

అదే సుమన్‌ లైఫ్‌ని తలకిందులు చేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన ఒక కొత్త విషయాన్ని షేర్‌ చేసుకున్నాడు.

ఇందులో సంచలన వ్యాఖ్యలు చేశాడు.తన అమ్మగారు( Suman Mother ) పడ్డ ఇబ్బందులను పంచుకుంటున్నారు.

అంతేకాదు కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే అంటూసంచలన వ్యాఖ్యలు చేశారు.తనపై ఎవరో కుట్ర చేశారని అంటుంటారు, అది ఎవరనది తనకు కూడా తెలియదని, కానీ ఎవరైనా దాని ఫలితాలు అనుభవించాల్సిందే అంటూ హాట్‌ కామెంట్‌ చేశారు.

ఈ ఘటన వల్ల నేను ఇప్పుడు పెద్దగా బాధపడటం లేదు.కానీ ఆ సమయంలో దారుణమైన పరిస్థితులు ఫేస్‌ చేసాను.

"""/" / ఆరు నెలలు చాలా కష్టంగా ఉండింది.కానీ ఇప్పుడు దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

కానీ అమ్మ విషయంలో నాకు చాలా బాధగా ఉంది.ఆ సమయంలో అమ్మ ఏడ్చింది.

చాలా స్ట్రగుల్‌ అయ్యింది.ఆ ఘటన తనకంటే అమ్మకే ఎక్కువగా దెబ్బకొట్టింది.

ఆమె ఎంతో కుంగిపోయింది.ఆమె బాధ నాకు బాధ కలిగించింది అని చెప్పుకొచ్చారు సుమన్.

అయితే ఎవరు చేశారనేది తెలియదు.నేను దేనికో ఈ కర్మ( Karma ) అనుభవించాను.

అలాగే నాకు ఎవరు చేసినా వాళ్లు కర్మ అనుభవిస్తారు అది ఎవరినీ వదిలిపెట్టదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సుమన్‌.

ప్రస్తుతం చాలా మందిని చూశాం.ఇలా అనుభవిస్తున్నాడు, ఇలా చనిపోయాడు, అలా చనిపోయాడు.

ఆసుపత్రిలో ఇలాంటి స్థితిలో ఉన్నాడు, లేదంటే ఫ్యామిలీ విషయంలో ఇలా అయ్యిందనేది చూస్తుంటాం, వింటుంటాం.

అది వాళ్ల కర్మ ఫలం అని, దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని వెల్లడించారు సుమన్‌.

ఆస్ట్రేలియాలో ఫేమస్ అవుతోన్న హిమాలయన్ శిలాజిత్.. ఎలా వాడుతున్నారంటే..?