నా ప్రేమ ఆమె లాంటిది కాదు.... వేదికపై హీరోయిన్ పరువు తీసిన డైరెక్టర్ గోపీచంద్!
TeluguStop.com
నందమూరి నట సింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ద్వారా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఒంగోలులో ఎంతో ఘనంగా నిర్వహించారు.
వందల సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడంతో జై బాలయ్య అనే నినాదాలతో ఆ ప్రాంగణం మొత్తం హోరెత్తిపోయింది.
ఇలా ఎంతో ఘనంగా ఈ వేడుక జరిగింది.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ తాను సమరసింహారెడ్డి సినిమా చూడటం కోసం 18 కిలోమీటర్లు దూరం నడిచి వచ్చి ఒంగోలులో ఆ సినిమా చూశానని తెలిపారు.
ఇలా ఒకప్పుడు మీలాగా అభిమానిగా అక్కడి నుంచి బాలయ్యను చూస్తూ సంతోషపడ్డాను ఆయన అభిమానిగా ఆయనతో సినిమా చేయడం నా అదృష్టం అని తెలిపారు.
ఇక హీరోయిన్ శృతిహాసన్ గురించి మాట్లాడుతూ ఇప్పటికి ఆమె తన మూడు సినిమాలలో నటించిందని తన నటన డాన్స్ మొత్తం ఇరగదీసింది ఐ లవ్ యు శృతి అంటూ శృతిహాసన్ గురించి చెప్పారు.
"""/"/
ఇక నా టీం మొత్తం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశారు వీళ్లంతా కూడా బాలయ్య బాబు అభిమానులే.
ఇలా బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసి ఒక సినిమా చేస్తే అది వీరసింహారెడ్డి సినిమా అవుతుంది.
లవ్ యు బాబు అంటూ బాలకృష్ణ గురించి కూడా ఈయన చెప్పారు.అయితే ఇది శృతిహాసన్ మీపై చూపించిన ప్రేమ లాగా కాదు ఈ ప్రేమ మనసులో నుంచి వచ్చినది.
ఇది ఒక ఫ్యాన్ లవ్ అంటూ బాలకృష్ణ పై తనకున్న ఇష్టాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.
అయితే ఇది శృతిహాసన్ లాంటి ప్రేమ కాదని గోపీచంద్ చెప్పడంతో శృతిహాసన్ తలదించుకొని నవ్వేశారు.
వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!