అది లేక నా జీవితం తలకిందులు అయ్యింది.. ఒకప్పటి హీరోయిన్ కామెంట్స్ వైరల్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి.కొన్ని గాసిప్స్ అయితే ఆ సెలబ్రిటీలను బాధ పెట్టడంతో పాటు మనోవేదనకు కూడా గురి చేస్తూ ఉంటాయి.

కొంతమంది సోషల్ మీడియాలో వినిపించే వార్తలను నిజం అని నమ్ముతూ ఉంటారు.అయితే ఆ గాసిప్స్ చాలామంది హీరో హీరోయిన్ల జీవితాలను తలకిందులు చేశాయి.

ఆ గాసిప్స్ సెలబ్రిటీల జీవితాలను మార్చేయడంతో పాటుగా ఛాన్సులు దొరకక వాళ్ళు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కొన్ని కొన్ని సార్లు సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు.

"""/"/ అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ గాసిప్స్ కి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పవచ్చు.

అయితే ఆ సోషల్ మీడియాని లేక తన జీవితం నాశనం అయ్యింది అంటుంది ప్రముఖ హీరోయిన్.

హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ అలనాటి నటి అను అగర్వాల్.మొదట ఆషీకీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ.

మొదటి సినిమాతోనే రాత్రికి రాత్రి స్టార్ డంను సంపాదించుకుంది.ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి నటిగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

కానీ 1999 లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది.

ఆ రోడ్డు ప్రమాదం కారణంగా ఆమె నెల రోజులపాటు కోమాలోకి వెళ్లిపోయింది. """/"/ ఇది ఇలా ఉంటే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అను అగర్వాల్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.అప్పట్లో తాను ఒక వ్యక్తితో సహజీవనం చేశానని అతని తల్లి అందుకు అంగీకరించారని తెలిపింది.

కానీ ఆమె స్నేహితులు తన గురించి చెడుగా చెప్పారని వార్తాపత్రికలో తన గురించి చెడుగా గాసిప్స్ ను నమ్మితంగా అపార్థం చేసుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

దాంతో తన జీవితం నాశనం అయ్యిందని, స్వేచ్ఛను కోల్పోయానని ఆ సమయంలో ఒకవేళ సోషల్ మీడియా ఉండి ఉంటే జనాలకు కాస్తయినా నిజాలు తెలిసేవి అని ఆమె బాధను వ్యక్తం చేసింది.