మరణాంతరం నా సమాధి ఇక్కడే ఉండాలి... ప్రశాంత్ నీల్ ఎమోషనల్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి అందరికీ సుపరిచితమే.

ఈయన కన్నడ దర్శకుడు అయినప్పటికీ ఈయన స్వస్థలం మాత్రం మన అనంతపురం కావడం విశేషం.

ఇలా తెలుగు వ్యక్తిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరికెక్కిన కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈయన నీలకంఠాపురం గ్రామానికి చెందిన వ్యక్తి మాత్రమే కాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డికి స్వయాన అన్నయ్య కొడుకు కావడం విశేషం.

తాజాగా ప్రశాంత్ నీల్ తన స్వగ్రామమైన నీలకంఠాపురం విచ్చేసిన సంగతి మనకు తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన నీలకంఠాపురం రావడంతో ఒక్కసారిగా అభిమానులు తనని చూడడం కోసం తరలివచ్చారు.

ఆగస్టు 15వ తేదీ తన తండ్రి శుభాష్ రెడ్డి 75వ జయంతి వేడుకలు కావడంతో ఈయన నీలకంఠాపురంలో తన తండ్రి సమాధిని దర్శించుకున్నారు.

అనంతరం నీలకంఠాపురంలో ఉన్నటువంటి నీలకంటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

"""/"/ ఇకపోతే అదే గ్రామంలో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి ప్రశాంత్ నీల్ 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తాను డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ తన స్వస్థలం నీలకంఠాపురమేనని, తాను మరణించిన తరువాత తన సమాధి కూడా తన తండ్రి సమాధి పక్కనే ఉండాలంటూ ఈయన ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వైరల్ వీడియో: అదిరిపోయిన టి20 ప్రపంచ కప్ అధికార గీతం..