సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 300 కిలోమీటర్ల రేంజ్.. ఈ స్కూటర్ చాలా స్పెషల్…

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల( Electric Scooters ) మార్కెట్లో ఒక స్కూటర్ సెన్సేషనల్ గా మారింది.

వారం రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ స్కూటర్ ఏకంగా 300 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తూ అందరి కళ్ళను తన వైపే తిప్పుకుంటోంది.

ఐఎంఈ ర్యాపిడ్ పేరుతో మల్టీ-బ్రాండ్ ఈ-మొబిలిటీ రిటైల్ స్పేస్ అయిన MY EV స్టోర్ భారతదేశంలో దీనిని లాంచ్ చేసింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.ఈ వేరియంట్లు సింగిల్ ఛార్జింగ్‌పై 100, 200 లేదా 300 కిలోమీటర్ల అందిస్తున్నాయి, దీనితో పాటు గరిష్టంగా 80 Kmph వేగంతో ప్రయాణించవచ్చు.

IME ర్యాపిడ్ స్కూటర్ ధర రూ.99,000 నుంచి రూ.

1.48 లక్షల మధ్య ఉంటుంది.

"""/" / IME ర్యాపిడ్ ఫీచర్లు( IME Rapid Features ) తెలుసుకుంటే ఇందులో 2000 W మోటార్, వేరియంట్‌ను బట్టి 60V-26/52/72 AH బ్యాటరీ సామర్థ్యంతో అందించారు.

ఇది స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్, బ్యాటరీ స్టేటస్, మ్యాప్ వ్యూ ప్రదర్శించే LED డిజిటల్ కన్సోల్‌ను అందిస్తుంది.

పనితీరు గురించి తెలుసుకుంటే IME ర్యాపిడ్ 5 సెకన్లలో 0 నుంచి 40 Kmph వరకు వేగాన్ని చేరుకోగలదు.

స్కూటర్ రేంజ్ వేరియంట్, రైడింగ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. """/" / IME ర్యాపిడ్ ఒకే ఛార్జ్‌పై 300 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

IME ర్యాపిడ్ గరిష్టంగా 80 Kmph వేగంతో సుదూర ప్రయాణాలు చేయడానికి అనుమతిస్తుంది.

అన్ని బైకుల లాగానే దీని ధర కూడా అందుబాటులోనే ఉంటుంది.అయితే దీని లుక్కు అంత స్టైలిష్ గా ఏమీ ఉండదు.

ఛార్జింగ్ సమయం కూడా ఎక్కువ ఉంటుంది.ఈ మైనస్ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని కొనాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.

బాయ్ కాట్ ప్రకాష్ రాజ్… టాలీవుడ్ లో అవకాశాలు లేనట్టేనా?