ఫోటోగ్రఫీలో స్టేట్ లెవెల్ బహుమతి అందుకున్న ముత్యాల ప్రభాకర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఫోటోగ్రాఫర్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి పల్లె జీవనం పైన తీసినటువంటి ఛాయాచిత్రం కరీంనగర్ టైమ్స్ వారి నిర్వహించిన స్టేట్ లెవెల్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లో బహుమతినీ కరీంనగర్ లోని శుభమాంగల్య కన్వెన్షన్ హాల్లో ట్రెస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు,ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జార్జి రెడ్డి,టైమ్స్ కరీంనగర్ దినపత్రిక సంపాదకులు గుంటపల్లి స్వామి,ఆల్ ఫోర్స్ కళాశాల ప్రిన్సిపల్, సి పి ఐ రాష్ట్ర నాయకులు బలుమూరి వెంకట్ రెడ్డి చేతులమీద బహుమతి అందుకున్నారు.

బహుమతి రావడం పట్ల రాష్ట్ర, జిల్లా ఫోటో వీడియోస్ గ్రాఫర్స్ సంక్షేమ సంఘం సభ్యులు తిరుపతి యాదవ్,మారోజు నరసింహ చారి,మహమ్మద్ షాదుల్,పాలోజి శ్రీనివాస్, మహమ్మద్ ఫక్రోద్దిన్, శ్యామంతుల అనిల్, మా రోజు కుబేర్, పాలోజి శంకర్, శ్యామ్ బహుమతి రావడం పట్ల పలువురు అభినందించారు.

అలాంటి ప్రశ్నలు మాత్రం అస్సలు అడగొద్దు.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!