ఆ గుడిలో ప్రసాదంగా మటన్‌ బిర్యాని... ఎక్కడో కాదు మన పక్కనే

హిందూ దేవాలయాల్లో మాంసాహారం నిషిద్దం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రముఖ దేవాలయాలు అన్ని కూడా మాసాంహారంను నిషేదించిన నేపథ్యంలో ముఖ్యమైన పండుగలు మరియు ఇతర ముఖ్యమైన రోజుల్లో హిందువులు మాసాహారంను భుజించరు.

చాలా వరకు హిందువులు మాసాహారంకు దూరంగా ఉంటారు.ప్రతి గుడిలో కూడా పులిహోరా లేదా దద్దోజనం వంటి పదార్థాలు మాత్రమే పెడతారు.

అయితే హిందూ దేవాలయాలన్నింటిలో కూడా చాలా విభిన్నమైన గుడి తమిళనాడులోని మునీశ్వరుడి ఆలయం.

ఈ ఆలయంలో ప్రసాదంగా మటన్‌ బిర్యానీని పెడతారు, కేవలం దేవుడికి మాత్రమే కాకుండా భక్తులకు కూడా ఎంత అడిగితే అంత అన్నట్లుగా పులిహోరా పంచినట్లుగా మటన్‌ బిర్యానీ పంచుతూ ఉంటారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.తమిళనాడు మధురై జిల్లాలోని తిరుమంగళం సమీపంలో వడుకంపట్టి అనే ఒక గ్రామం ఉంది.

ఆ గ్రామంలోనే ఉంటుంది మునీశ్వరుడి ఆలయం.ఆ ఆలయంలో జనవరి 25వ తారీకున రెండు వేల కిలోల భాస్మతీ రైస్‌ మరియు 500 కేజీల మటన్‌ తో బిర్యానీ చేసి ప్రసాదంగా పెట్టారు.

గుడి నిర్వాహకులు కాకుండా చందాలు వేసుకుని ఈ బిర్యానీ ప్రసాదంను ఏర్పాటు చేయడం జరిగింది.

గత ఏడాది కూడా ఇదే తరహాలో బిర్యాణీ ప్రసాదంతో మునీశ్వరుడి భక్తులను స్థానికులు సంతృప్తి పర్చడం జరిగింది.

ఎక్కడ లేని విధంగా తమిళనాడులో ఇలాంటి వింత ఆచారం ఉండటంతో అంతా కూడా దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు.

మునీశ్వరుడి గుడిలో బిర్యానీ పెట్టడంకు స్థానికులు ఒక కథను చెబుతూ ఉంటారు.అందేంటి అంటే.

85 ఏళ్ల క్రితం సుబ్బనాయుడు అనే వ్యక్తి మునీశ్వర పేరుతో హోటల్‌ను పెట్టాడట.

ఆ హోటల్‌లో బిర్యానీ అమ్మేవాడు.ఆయన హోటల్‌కు మంచి పేరు వచ్చింది.

బాగా డబ్బులు సంపాదించాడు.దాంతో తన హోటల్‌ను మునీశ్వరుడు సక్సెస్‌ చేశాడనే నమ్మకంతో ప్రతి ఏడాది కూడా బిర్యానీ ప్రసాదంను పెడుతూ వస్తున్నాడు.

అలా ఆ ఏరియాలో ఉన్న వారు ఎంతో మంది కూడా హోటల్స్‌ పెట్టి సక్సెస్‌ అవ్వడం, బిర్యానీకి అక్కడ మంచి పేరు రావడంతో మునీశ్వరుడికి శాస్వత బిర్యానీ ప్రసాదంను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ బిర్యానీ ప్రసాదంను కొందరు హిందువులు తప్పుబడుతున్నారు.అయితే కొందరు మాత్రం దేవుడు శాఖాహారమే తనకు కావాలని చెప్పలేదు కనుక మాసాహారం అయిన ఆయనకు ప్రసాదంగా పెట్టవచ్చు అంటూ వాదిస్తున్నారు.

ఏది ఏమైనా దాదాపు 85 ఏళ్లుగా మునీశ్వరుడికి, ఆయన భక్తులకు బిర్యానీ ప్రసాదం దొరుకుతుంది.

రోజుకొక‌ ఉసిరికాయ తింటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా..?