హీరోయిన్ మహేశ్వరిని చూసి నచ్చకపోయినా అవకాశం ఇచ్చిన దర్శకుడు
TeluguStop.com

ప్రముఖ దర్శకుకు ముత్యాల సుబ్బయ్య, ఎల్వీ రామరాజు అనే నిర్మాతతో కలిసి శ్రీవారి ప్రియురాలు అనే ఓ సినిమాను తెరకెక్కించాడు.


తన భర్తకు మరో ప్రియురాలు ఉండటం ఏ మహిళైనా భరించలేదు.కొత్త పాయింట్ తో సినిమా చేయాలనుకున్నారు.


మనసు కన్నా మాంగళ్యం గొప్పది అని ఈ సినిమా కథాంశం.కెఎల్ ప్రసాద్ ఈ సినిమా కథ రాశాడు.
దానికి ఆకెళ్ల చక్కటి మాటలు రాశాడు.వినోద్ కుమార్, ఆమని, ప్రియా రామన్ హీరో, హీరోయిన్లుగా ఎంపిక అయ్యార.
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సమయంలో మాజీ ప్రియురాలు వస్తుంది.
భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటాడు హీరో.అయితే ఈ కథలో కొడుకుకు బదులు కోడలికి సపోర్టుగా ఉంటారు అత్తామామలు.
కొడుకు సంసారాన్ని నిలబెట్టేందుకు వారి ఆడే నాటకం ఆకట్టుకుంటుంది.సినిమా రీలీజ్ అయ్యిం.
మంచి విజయం సాధించింది.వినోద్‌కుమార్, ఆమని, సత్యనారాయణ, శారద సహా పలువురు నటీనటులు చక్కగా నటించారు.
అనంతరం టి.కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ అధినేత నాగేశ్వరరావు ఓ కథ రెడీ చేశాడు.
ఆ సినిమా పేరు అమ్మాయి కాపురం.టి.
కృష్ట పెద్దబ్బాయి ప్రేమ్‌చంద్ డిగ్రీ కంప్లీట్ చేసి దర్శకత్వం శాఖలో పనిచేశాడు.అన్న సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు.
అమ్మాయి కాపురం సినమాకూ సైతం పని చేశాడు.ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్నారు.
అప్పుడు నిర్మాత మహేశ్వరి ఫోటోలు చూపించాడు. """/"/ ఈమె శ్రీదేవికి సిస్టర్ అవుతుందని చెప్పాడు.
అటు తమిళంలో భారతీరాజా ఈమెతో ఓ సినిమా చేస్తున్నాడని చెప్పాడు.సరే రమ్మని చెప్పాడు సుబ్బయ్య.
అయితే దర్శకుడికి చెప్పకుండా ఆ అమ్మాయిని బుక్ చేశాడు నిర్మాత.అయితే సుబ్బయ్య మహేశ్వరిని అప్పటి వరకు చూడలేదు.
తొలి రోజు షూటింగ్ స్పాట్ కు వచ్చిన ఆమెను చూసి సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు.
ముఖం నల్లగా మాడింది.ఏ గ్లామర్ లేని మహేశ్వరిని చూసి నీరసించి పోయాడు.
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా తను సరిగా లేకపోతే ఎలా? అంటూ ఆలోచనలో పడ్డాడు.
"""/"/
తనకు చెప్పకుండా మహేశ్వరిని హీరోయిన్‌గా బుక్ చేసిన నాగేశ్వర రావుపై సుబ్బయ్యకు బాగా కోపం వచ్చింది.
ఆయనను పిలిచి ఏంటిదని ప్రశ్నించాడు.తను ఏం చెప్పలేకపోయాడు.
అప్పటికే సినిమా షూటింగ్ కోసం ఆర్టిస్టులు అక్కడికి చేరుకున్నారు.షూటింగ్ వాయిదా వేయలేని పరిస్థితి ఉంది.
వేరే వారైతే కచ్చితంగా హీరోయిన్ ను మార్చాలి అనేవారు.కానీ సుబ్బయ్య కాదనలేకపోయాడు.
మహేశ్వరి నచ్చకపోయినా సుబ్బయ్య కాదనలేకపోయాడట.
హీరోయిన్ నేహాశెట్టికు ఉన్న సూపర్ పవర్ ఇదే.. ఎంత తిన్నా అలా కాదంటూ?